SBI Jobs Notification: ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలు, నోటిఫికేషన్ విడుదల
SBI Jobs Notification: నిరుద్యోగులకు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకై ఎదురుచూస్తున్నవారికి నిజంగా గుడ్‌న్యూస్. దేశంలోని అతి పెద్ద బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ భారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ఆ వివరాలివీ..
SBI Jobs Notification: నిరుద్యోగులకు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకై ఎదురుచూస్తున్నవారికి నిజంగా గుడ్‌న్యూస్. దేశంలోని అతి పెద్ద బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ భారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ఆ వివరాలివీ..
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారు సహజంగా ప్రభుత్వ బ్యాంకుల కోసం నిరీక్షిస్తుంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఐదు సర్కిల్స్‌లో ఏకంగా 12 వందలకు పైగా ఉద్యోగాల భర్తీకే రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభించింది. ఎస్బీఐ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఆకర్షణీయమైన వేతనం, మంచి భవిష్యత్ ఉంటుంది.
మొత్తం పోస్టుల సంఖ్య 1226 కాగా, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. డిసెంబర్ 1, 2021 నాటికి ఏదైనా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో కనీసం రెండేళ్ల అనుభవముండాలి. నిబంధనల ప్రకారం డిగ్రీ పూర్తి చేసుకున్న తరువాతే..సంబంధిత అనుభవముండాలి. ఈ ఉద్యోగాల వేతనం 36 వేల 100 రూపాయల్నించి 63 వేల 840 రూపాయల వరకూ ఉంటుంది. డిసెంబర్ 1, 2021 నాటికి 21-30 ఏళ్ల వయస్సులోబడి ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్ధులకు గరిష్ట వయో పరిమితి ఉంటుంది. ఎస్బీఐ (SBI Jobs Recruitment)ఈ ఉద్యోగాలను మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. రాత పరీక్ష, స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
ముందు ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్ష నాలుగు విభాగాల్లో 120 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీషులో 30 మార్కులు, బ్యాంకింగ్ నాలెడ్జ్ 40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 30 మార్కులు, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 20 మార్కులకు ఉంటుంది. పరీక్షకు రెండు గంటల సమయముంటుంది. రాత పరీక్షలో భాగంగా ఆబ్జెక్టివ్ పరీక్ష ఇంగ్లీషు భాషపై 50 మార్కులకు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ ఉంటాయి. ఆ తరువాత స్క్రీనింగ్ కమిటీ పరిశీలన ఉంటుంది. అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
రాత పరీక్షలో విజయం సాధించిన అభ్యర్ధులకు 1/3 నిష్పత్తిలో పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అభ్యర్ధుల రాత పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను వెయిటేజ్ ఆధారంగా క్రోడీకరించి నిర్ణయిస్తారు. రాత పరీక్షలో 75 శాతం వెయిటేజ్, పర్సనల్ ఇంటర్వ్యూలో పొందిన మార్కులకు 25 శాతం వెయిటేజ్ కల్పిస్తారు. దాంతోపాటు సంబంధిత రాష్ట్రానికి చెందిన అధికార భాషపై లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఆ భాషా పరీక్షలో తప్పనసరిగా క్వాలిఫై కావాలి. ఎంపికైన అభ్యర్ధులకు ముందు 6 నెలల ప్రొబేషన్ ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ సమయంలో ప్రతిభ ఆధారంగా పర్మనెంట్ చేస్తారు. పూర్తిగా పర్మనెంట్ అయిన తరువాత మాత్రమే గ్రేడ్ 1 హోదాతో వేతనం ఉంటుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు(Online Applications)చేసుకోవల్సి ఉంటుంది. వివిధ సర్కిల్స్‌లోని రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రానికే అప్లై చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 29గా ఉంది. 2022, జనవరి 12 నుంచి కాల్ లెటర్స్ జారీ అవుతాయి. జనవరిలో పరీక్ష నిర్వహిస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో పరీక్ష ఉంటుంది. ఫిబ్రవరి 2022 రెండవ, మూడవ వారంలో ఫలితాలుంటాయి. పర్సనల్ ఇంటర్వ్యూలు మాత్రం 2022 మార్చ్, ఏప్రిల్ నెలల్లో ఉంటుంది. ఇతర వివరాలకు ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ https://bank.sbi/careersలో అప్లై చేయాలి.
Also read: Viral News: మనిషిని వెంటాడి దాడి చేసిన ఏనుగు.. వీడియో వైరల్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook