న్యూఢిల్లీ: ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వినియోగదారులకు తీపికబురునందించింది. సేవింగ్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ తప్పనిసరి అనే నిబంధనను రద్దు చేయడంతో పాటు సేవింగ్ ఖాతాలకు వడ్డీ రేటును 3 శాతానికి తగ్గించింది. ప్రతి నెలా అన్ని రకాల పొదుపు ఖాతాలలో కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: సచిన్ కు చేరువలో విరాట్ కోహ్లీ.... ఈ సిరీస్ లో ఆ రికార్డు బద్దలవుతుందా?


ఎస్‌బిఐ బ్యాంక్ ఈ నిర్ణయం వల్ల 44.51 కోట్ల మంది వినియోగదారులు లబ్ధి పొందుతారని, కనీస బ్యాలెన్స్ లేకపోతే నెలకు రూ.5 నుండి రూ.15లు వినియోగదారుల నుడి వడ్డించేది. నగర ప్రాంతాల్లో రూ .3000 ను, చిన్న పట్టణాలకు పరిమితి రూ.2000 కాగా, గ్రామీణ ప్రాంతాలకు కనీస బ్యాలెన్స్ పరిమితి రూ.1000 ఉండేదని, ఇకపై పరిమితులు ఉండవని తెలిపింది. 


Read Also: ఎంపీ బండి సంజయ్ చేతికి అందుకే తెలంగాణ బీజేపి పగ్గాలు ఇచ్చారా ?


సంవత్సరానికి వడ్డీ రేటును మూడు శాతంగా నిర్ణయించిందని, ప్రస్తుతం ఎస్‌బిఐ సేవింగ్స్ ఖాతాలో లక్ష వరకు డిపాజిట్లు 3.25 శాతం వడ్డీని పొందుతుండగా, లక్షకు పైగా డిపాజిట్లు 3 శాతం చొప్పున వడ్డీని పొందుతాయని తెలిపింది. ఈ నిర్ణయం ఖాతాదారులకు ఆనందం కలిగే విషయమని ఎస్‌బిఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..