సచిన్ కు చేరువలో విరాట్ కోహ్లీ.... ఈ సిరీస్ లో ఆ రికార్డు బద్దలవుతుందా?

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 12,000 పరుగులు మైలురాయికి చేరువ కావడానికి ఇంకా కేవలం 133 పరుగుల దూరంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఈ మైలు రాయి చేరుకుంటాడా.. వేచి చూడాల్సిందే. కాగా మాస్టర్ బ్లాస్టర్ ఈ మైలురాయిని చేరుకోవడానికి 

Last Updated : Mar 11, 2020, 10:35 PM IST
సచిన్ కు చేరువలో విరాట్ కోహ్లీ.... ఈ సిరీస్ లో ఆ రికార్డు బద్దలవుతుందా?

ముంబై: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 12,000 పరుగులు మైలురాయికి చేరువ కావడానికి ఇంకా కేవలం 133 పరుగుల దూరంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఈ మైలు రాయి చేరుకుంటాడా.. వేచి చూడాల్సిందే. కాగా మాస్టర్ బ్లాస్టర్ ఈ మైలురాయిని చేరుకోవడానికి టెండూల్కర్ 300 ఇన్నింగ్స్ ఆడగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 314 ఇన్నింగ్స్‌లలో 12,000 వన్డే పరుగులు సాధించిన జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ తన కెరీర్‌లో ఇప్పటివరకు 239 ఇన్నింగ్స్‌లు ఆడగా, ఈ సిరీస్‌లో అతను 12,000 దాటితే, అతను సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి మైలురాయిని చేరుకుంటాడు. 

Read Also:  మరో కీలక ఘట్టం.. ఆనందంలో మునిగితేలుతున్న రైతాంగం

కెప్టెన్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే సిరీస్‌లో సత్తా చాటి మైలు రాయిని అందుకుంటాడా లేదో చూడాలి. అంతకుముందు న్యూజిలాండ్‌లో ఇటీవల ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో, కోహ్లీ అత్యధిక స్కోరు 51, కాగా మిగతా రెండు మ్యాచ్‌ల్లో 15, 9 పరుగులు చేశాడు. తరువాతి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో, 2, 19, 3, 14 స్కోర్‌లను మాత్రమే సాధించి పేలవ ప్రదర్శన కనబర్చాడు. 

భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే గురువారం ధర్మశాలలో, రెండో వన్డే ఆదివారం లక్నోలో జరుగనుండగా, చివరి వన్డే మార్చి 18 న కోల్‌కతాలో జరగనుంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News