ప్రపంచ వింతలో ఒకటిగా గుర్తింపుబడ్డ  తాజ్‌మహల్ మనకు ఎప్పటికీ వెలకట్టలేని ఆస్తిగానే మిగిలిపోతుంది. అలాంటి అందమైన,చిరస్మరణీయమైన కట్టడంపై పాలకులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఇది సామన్య జనాల వాయిస్ కాదు ..ఏకంగా అత్యున్నత ధర్మాసనమే చెప్పింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజ్ మహల్ పరిరక్షణ విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు పైర్ అయింది. అపూరప కట్టడమైన తాజ్ ను పరిరక్షించే ఉద్దేశం అసలు మీకు ఉందా ? మీ నిర్లక్ష్యం వల్ల పర్యాటక ఆదాయం తగ్గుతున్నది అంటూ కేంద్రం, యూపీ సర్కారుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై స్పందిస్తూ తాజ్ పరిరక్షణ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి చారిత్రాత్మక కట్టడాన్ని కాపాడుతారా? లేదంటే కూల్చేస్తారా ? తేల్చిచెప్పాలంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు మొట్టికాయలు వేసింది.


తాజ్‌మహల్ పరిరక్షణపై దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ మదన్ బీ.లోకూర్, జస్టిస్ దీపక్‌గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా తాజ్ పరిరక్షణకు భారత్ పురావస్తుశాఖ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.