సెక్షన్ 377ను తిరిగి పరిశీలించనున్న సుప్రీం ధర్మాసనం
స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఐపీసీలోని సెక్షన్ 377ను సమీక్షించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఐపీసీలోని సెక్షన్ 377ను సమీక్షించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 2013లో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటూ అత్యున్నత ధర్మాసనం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే..! ఢిల్లీ హైకోర్టు ఇది నేరం కాదని ఇచ్చిన తీర్పును సుప్రీం ఆనాడు పక్కన పెట్టేసింది.
సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం, సోమవారం స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) యొక్క సెక్షన్ 377ని తిరిగి పరిశీలిస్తుందని చెప్పింది.
అయితే గోప్యత అన్నది ప్రాథమిక హక్కులో భాగమని.. ఇటీవలే ఆధార్ కేసులో కూడా సుప్రీం స్పష్టం చేసిన నేపథ్యంలో.. దీన్ని ఆధారంగా చేసుకొని ఎల్జీబీటీ కమ్యూనిటీ తాజాగా సుప్రీంను ఆశ్రయించింది. తాము సహజసిద్ధమైన లైంగిక అవసరాలు తీర్చుకునే విషయంలో పోలీసులను చూసి భయపడాల్సి వస్తోందని వివరించింది. స్వలింగ సంపర్కాన్ని నేరమనే సెక్షన్ ను తొలగించాలని కోరింది. దీంతో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి దీనిపై మీ స్పందన ఏంటో తెలియజేయాలని అడిగింది.