Lakhimpur Kheri violence: లఖింపుర్ ఖేరి ఘటన విచారణలో సుప్రీం సీరియస్
SC to UP govt on Lakhimpur Kheri violence : లఖింపుర్ ఖేరి ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ సాగింది. ఈ ఘటనకు సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం చివరి నిమిషంలో నివేదిక సమర్పించడంపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఈ కేసు విచారణను ఒక అంతులేని కథగా మార్చొద్దంటూ వ్యాఖ్యలు చేసింది సుప్రీం.
SC to UP govt on Lakhimpur Kheri violence: You're dragging your feet, can't be unending story: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్ ఖేరి ఘటనపై (Lakhimpur Kheri violence) బుధవారం సుప్రీంకోర్టులో విచారణ సాగింది. ఈ ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం చివరి నిమిషంలో నివేదిక సమర్పించడంపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఈ కేసు విచారణను ఒక అంతులేని కథగా మార్చొద్దంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది సుప్రీం.
తెల్లవారుజామున ఒంటిగంట వరకూ నివేదిక కోసం ఎదురుచూశామని సుప్రీం కోర్టు (Supreme Court) యూపీ ప్రభుత్వంపై మండిపడింది. మీరు చివరి నిమిషంలో సమర్పిస్తే.. మేమెప్పుడు దాన్ని పరిశీలించాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం ఒకరోజు ముందైనా సమర్పించాలి కదా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice N.V. Ramana) అసంతృప్తి వ్యక్తం చేశారు. లఖింపుర్ ఘటనలో యూపీ ప్రభుత్వం ఎక్కువ మంది సాక్షుల్ని ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. 164 మంది సాక్షుల్లో ఇప్పటివరకు మీరు 44 మందినే మాత్రమే విచారించారు. మిగతవారిని ఎందుకు విచారించలేకపోయారు అని ప్రశ్నించారు. అలాగే సాక్షులకు రక్షణ కల్పించాలి... వారి వాంగ్మూలాల్ని రికార్డు చేయాలి. ఇది ఒక అంతులేని కథలా మారకూడదంటూ వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఆరోపణలు చాలా తీవ్రమైనవి అని యూపీ ప్రభుత్వానికి (UP Government) సీజేఐ గుర్తుచేశారు.
Also Read : Samantha Defamation Case:కోర్టును ఆశ్రయించిన సమంత..YouTube ఛానెళ్లపై పరువునష్టం దావా
అయితే ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీలో (Lakhimpur Kheri violence) సాగు చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతోన్న రైతులపై కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా (Ashish Mishra) వాహన శ్రేణి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో నలుగురు రైతులతో పాటు ఎనిమిది మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. ఇక అక్టోబర్ 11న ఆశిష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read : DGP Gowtham Sawang: పట్టాభి వ్యాఖ్యల వెనుక కుట్రకోణం దాగుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి