Lakhimpur Kheri violence MoS Ajay Mishra’s son Ashish Mishra appears before UP police: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న ఆశిష్ మిశ్రా శనివారం పోలీసుల ఎదుట హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటన (Lakhimpur Kheri violence) తర్వాత కన్పించకుండా పోయారు.
శుక్రవారమే హాజరుకావాలంటూ ఆదేశాలు
ఈ ఘటనలో విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు ఆశిష్ మిశ్రాకు (Ashish Mishra) సమన్లు జారీ చేశారు. శుక్రవారమే ఆశిష్ మిశ్రాను తమ ఎదుట హాజరవ్వాలని ఆదేశించారు. అయితే ఆయన రాలేదు. లఖింపుర్‌లో గత ఆదివారం ఆందోళన చేస్తున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా కారు, మరో వాహనం దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. తర్వాత జరిగిన అన్నదాతల దాడిలో మరో నలుగురు చనిపోయారు. లఖింపుర్ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. దీంతో ఆశిష్ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్‌లో విచారణ
ఈ క్రమంలో ఆశిష్ మిశ్రా నేపాల్ (Nepal) పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఆశిష్ తండ్రి అజయ్ మిశ్రా ( Ajay Mishra) ఖండించారు. అనారోగ్య కారణాల వల్లే తన కుమారుడు విచారణకు హాజరుకాలేదని అజయ్ మిశ్రా చెప్పారు. ఈ నేపథ్యంలో శనివారం కచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేయడంతో ఆశిష్ మిశ్రా లఖింపుర్‌లోని క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్‌కు (crime branch office) వచ్చారు.
#WATCH Son of MoS Home Ajay Mishra Teni, Ashish Mishra arrives at Crime Branch office, Lakhimpur
He was summoned by UP Police in connection with Lakhimpur violence. pic.twitter.com/g6wMpHYOKr
— ANI UP (@ANINewsUP) October 9, 2021
భద్రత కట్టుదిట్టం
ఘటనకు సంబంధించి ఆశిష్ మిశ్రాను విచారిస్తున్నట్లు సిట్ డీఐజీ తెలిపారు. ఇక ఆశిష్ మిశ్రా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు లఖింపుర్‌లోని (Lakhimpur) క్రైమ్ బ్రాంచ్ పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇంటర్నెట్ సేవలను కూడా ఆపేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి