School and College Holidays List in September: సెప్టెంబర్ నెలలో స్కూల్స్, కాలేజీలకు సంబంధించిన సెలవుల జాబితా వచ్చేసింది. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వ లేదా జాతీయ సెలవులు ఉండవు. ఆయా రాష్ట్ర పండుగల ఆధారంగా సెలవులు నిర్ణయించారు. కొన్ని రాష్ట్రాలు ఈ పండుగలను ప్రత్యేకంగా జరుపుకుంటారు. వివిధ రాష్ట్రాలు, వారి పాఠశాలల్లో దేశవ్యాప్తంగా పాటించే సెలవులు వేర్వేరుగా ఉంటాయి. ఇంకా సెప్టెంబర్ నెలలో ముఖ్యమైన రోజులలో ఒకటి  సెప్టెంబర్ 5. దేశం మొత్తం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే. ఆదివారం, రెండో శనివారం మినహాయించి సెలవుల జాబితాను చెక్ చేసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్:


==> శ్రీకృష్ట జన్మాష్టమి-సెప్టెంబర్ 7  
==> వినాయక చతుర్థి- సెప్టెంబర్ 19 
==> మిలాద్ ఉన్-నబీ/ఈద్-ఎ-మిలాద్- సెప్టెంబర్ 28.


తెలంగాణ:


==> శ్రీకృష్ణజన్మాష్టమి- సెప్టెంబర్ 6  
==> వినాయక చతుర్థి- సెప్టెంబర్ 19 
==> ఈద్-ఎ-మిలాద్- సెప్టెంబర్ 28.


తమిళనాడు: 


==> కృష్ణ జయంతి- సెప్టెంబర్ 6
==> వినాయక చతుర్థి- సెప్టెంబర్ 17 
==> మిలాద్-ఉన్-నబీ- సెప్టెంబర్ 28.


ఒడిశా:


==> శ్రీకృష్ణజన్మాష్టమి- సెప్టెంబర్ 6. 
==> గణేష్ పూజ- సెప్టెంబర్ 19. 
==> నుఖాయ్- సెప్టెంబర్ 20.
==> మిలాద్ ఉన్-నబీ/ఈద్-ఎ-మిలాద్- సెప్టెంబర్ 29.


కర్ణాటక:    


==> గణేష్ చతుర్థి/వినాయక చతుర్థి- సెప్టెంబర్ 19
==> మిలాద్ ఉన్-నబీ/ఈద్-ఎ-మిలాద్- సెప్టెంబర్ 28.


Also Read: Central Govt Schemes: వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ స్కీమ్ కింద అతి తక్కువ వడ్డీకే లోన్లు..!  


Also Read: Minister Roja: రజనీకాంత్ స్టైల్లో మంత్రి రోజా డైలాగ్.. పవన్, చంద్రబాబుకు కౌంటర్.. అర్థమైందా రాజా..!   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook