Garhwal university: ప్రపంచంలోనే తొలిసారిగా... 5 కోట్ల ఏళ్ల నాటి చీమలను గుర్తించిన భారత శాస్త్రవేత్తలు..
Uttrakhand: 5 కోట్ల 20 లక్షల ఏళ్ల నాటి చీమల లార్వా శిలాజాన్ని మన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలాంటి శిలాజాన్ని కనుగొనడం ఇదే మెుదటి సారని వారు పేర్కొన్నారు.
Uttrakhand Scientists: ఉత్తరాఖండ్ కు చెందిన శ్రీనగర్ లోని గర్వాల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే తొలిసారిగా 50 మిలియన్ సంవత్సరాల నాటి చీమల శిలాజాన్ని ఈ వర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. రాజస్థాన్‌లోని బికనీర్ గనుల నుంచి లార్వా రూపంలో చీమ శిలాజాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది అత్యంత పురాతనమైనదిగా సైంటిస్టులు పేర్కొంటున్నారు. ఈ శిలాజంపై లోతైన అధ్యయనం చేయనున్నట్లు వారు తెలిపారు. దీని ద్వారా ఫ్యూచర్ లో కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ఇది దోహదపడుతుందని వారు చెప్పారు. దీని అధ్యయనానికి రష్యా శాస్త్రవేత్తల సహకారం కూడా తీసుకున్నట్లు సమాచారం.
మంచి నీటిలో దొరకడం ఇదే మెుదటిసారి..
ప్రస్తుతం కనుగొనబడిన లార్వా యెుక్క పరిమాణం కేవలం 2 మిల్లీమీటర్లు మాత్రమే. మంచినీటిలో కనుగొనబడిన మొదటి శిలాజం ఇదే. ఇంతకు ముందెన్నడూ మంచినీటిలో లార్వా కనిపించిన దాఖలాలు లేవు. గతంలో జర్మనీ మరియు మయన్మార్‌లలో కూడా చీమల శిలాజాలు దొరికాయి. అయితే చీమల పరిణామాన్ని అర్థం చేసుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషించే లార్వాను కనుగొనడం మాత్రం ఇదే తొలిసారి.
''ఇప్పుడు కనుగొన్న లార్వా ఇల్మిడే కుటుంబానికి చెందినదని, అందులో రెండు కుటుంబాలు మాత్రమే భూమిపై నివసిస్తున్నాయని'' శాస్త్రవేత్తలు తెలిపారు. గర్వాల్ సెంట్రల్ యూనివర్సిటీలోని జియాలజీ విభాగం సీనియర్ శాస్త్రవేత్త ప్రొ. రాజేంద్ర రాణా మాట్లాడుతూ.. . 5 కోట్ల 20 లక్షల ఏళ్ల నాటి చీమల లార్వా కనిపించడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ప్రస్తుతం దొరికిన శిలాజ లార్వాకు, చీమలకు మధ్య పొడవులో తేడా లేదని... కాళ్ల నిర్మాణంలో మాత్రం తేడా ఉందని వారు చెప్పారు. లార్వా యొక్క కాళ్ళు కనిపించడం విశేషంగా ఆయన పేర్కొన్నారు.
Also Read: Aurangabad, Osmanabad: మరో రెండు నగరాల పేర్లు మార్చిన కేంద్రం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook