Aurangabad, Osmanabad: మరో రెండు నగరాల పేర్లు మార్చిన కేంద్రం

Aurangabad, Osmanabad Names Changed : ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్లు మార్చుతూ మహారాష్ట్ర కేబినెట్ గతేడాది అక్టోబర్ 20 న ఒక ప్రతిపాదను కేంద్ర హోంశాఖకు పంపించింది. ఈ ప్రతిపాదన ఆధారంగానే తాజాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.  

Written by - Pavan | Last Updated : Feb 25, 2023, 12:06 AM IST
Aurangabad, Osmanabad: మరో రెండు నగరాల పేర్లు మార్చిన కేంద్రం

Aurangabad, Osmanabad Names Changed: ఢిల్లీ: కేంద్రం తాజాగా మరో రెండు నగరాలకు పేర్లు మార్చింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్లు మార్చుతూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఔరంగాబాద్ గా పిలుచుకుంటున్న నగరానికి కొత్త ఛత్రపతి శంబాజీనగర్ గా పేరు మార్చుతున్నట్టు కేంద్రం తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే ఉస్మానాబాద్ నగరాన్ని ధారశివ్ గా మార్చినట్టు కేంద్రం స్పష్టంచేసింది.

ఇంతకీ ఈ కొత్త పేర్లు ఎలా ఎంపిక చేశారంటే..
ఔరంగాబాద్ కి కొత్తగా ప్రకటించిన పేరు ఛత్రపతి శంబాజీనగర్. మరాఠీలు తమ ఆరాధ్య దైవంగా భావించే ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు, ఆయన తండ్రి తరువాతి రాజు అయిన ఛత్రపతి శంబాజీ మహారాజ్ పేరునే ఔరంగాబాద్ నగరానికి పేరుగా పెట్టారు. 1681 నుంచి 1689 వరకు 8 ఏళ్లపాటు ఛత్రపతి శంబాజీ మహరాజ్ ఆ ప్రాంతాన్ని పరిపాలించారు. 1989 మార్చి నెలలో 31 ఏళ్ల యుక్త వయస్సులోనే ఛత్రపతి శంబాజీ మహారాజ్ చనిపోయారు. తండ్రి ఛత్రపతి శివాజీ మహరాజ్ తదనంతరం తాను చనిపోయే వరకు ఛత్రపతి శంబాజీ మహరాజ్ ఆ ప్రాంతాన్ని పరిపాలించారు. ఇక ఉస్మానాబాద్‌కి ధారాశివ్ నగరంగా పేరు మార్చడానికి కారణం అక్కడికి సమీపంలోనే ఉన్న గుహలు ఆధారంగా ఆ పేరు ఎంపిక చేశారు.

స్పందించిన దేవేంద్ర ఫడ్నవిస్
ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్లు మార్చుతూ మహారాష్ట్ర కేబినెట్ గతేడాది అక్టోబర్ 20 న ఒక ప్రతిపాదను కేంద్ర హోంశాఖకు పంపించింది. ఈ ప్రతిపాదన ఆధారంగానే తాజాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ.. తమ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఈ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవిస్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి : NEET PG 2023 Postponement: నీట్ పీజీ 2023 వాయిదా డిమాండ్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

ఇది కూడా చదవండి : Who is Ajay Banga: వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ పోస్టుకు భారత సంతతి వ్యక్తి అజయ్ బంగ..

ఇది కూడా చదవండి : Who is Vivek Ramaswamy: వివేక్ రామస్వామి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరో అమెరికన్ ఇండియన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News