Silver Hammer and Golden Chisel: రామాలయం ప్రాణ ప్రతిష్టతో అయోధ్య నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయోధ్యకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక రామాలయం గురించి రోజుకో ఆసక్తికర అంశం వెలుగులోకి వస్తుంది. తాజాగా బాలరాముడి విగ్రహం చెక్కిన విధానం బయటకు వచ్చింది. ముఖ్యంగా బాలరాముడి కళ్లు తేజోమయంగా.. అందంగా కనిపించడం వెనుక పెద్ద కారణమే ఉంది. శిల్పి కళ్లను ప్రత్యేక శ్రద్ధలతో చెక్కారు. విగ్రహం చెక్కడానికి ఉపయోగించిన పరికరాలను శిల్పి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్‌.. ఈ కథ స్ఫూర్తిదాయకం


పద్మాసనంపై కొలువైన బాలరాముడి కళ్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఆ కళ్లను అలాగే చూస్తూ ఉండాలనిపిస్తోంది. అంత అందంగా.. తేజోమయంగా ఉండడానికి కారణం చెక్కిన విధానం. కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన విషయం తెలిసిందే.  దేశంలో, ప్రపంచంలో ప్రఖ్యాత విగ్రహాలన్నింటినీ కూడా అరుణ్‌ చెక్కారు. ఇక అయోధ్య బాలరాముడి విగ్రహం రూపొందించే బాధ్యత కూడా అరుణ్ కు దక్కింది. ఈ మహాద్భాగ్యం దక్కడంతో అరుణ్ యోగిరాజ్‌ అత్యంత నియమ నిష్టలతో విగ్రహాన్ని రూపకల్పన చేశారు. విగ్రహం తయారుచేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చివరకు ఆయన తయారుచేసిన విగ్రహమే అయోధ్యలో ప్రతిష్టించడంతో 'నా జన్మ ధన్యమైంది' అని అరుణ్‌ యోగిరాజ్‌ భావించాడు.

Also Read: Bajrang Dal: ప్రేమికులకు అలర్ట్.. వాలంటైన్స్‌ డే రోజు బయటతిరగొద్దని బజరంగ్ దళ్ హెచ్చరిక


విగ్రహంలో ప్రత్యేకార్షణగా ఉన్న కళ్ల వెనుక ఉన్న కథను తాజాగా అరుణ్‌ యోగిరాజ్‌ 'ఎక్స్‌' వేదికగా తెలిపాడు. కళ్లను తీర్చిదిద్దడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపాడు. సాధారణ ఉలి, సుత్తిని వాడలేదని చెప్పాడు. బంగారం ఉలి, వెండి సుత్తి వినియోగించానని చెప్పుకొచ్చాడు. అందుకే కళ్లు అంత అందంగా తేజోమయంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నాడు. 'అయోధ్యలోని రామ్‌లల్లా విగ్రహ కళ్లు చెక్కడానికి వినియోగించిన బంగారు ఉలి, వెండి సుత్తిని మీతో పంచుకుంటున్నా' అని 'ఎక్స్‌'లో అరుణ్‌ యోగిరాజ్‌ పోస్టు చేశాడు. ఈ సందర్భంగా బంగారు ఉలి, వెండి సుత్తిలను చేతిలో పట్టుకున్న ఫొటోను పంచుకున్నాడు.



అరుణ్‌ యోగిరాజ్‌ కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి. ఈ విగ్రహాన్ని చెక్కడానికి ఆరు నెలల సమయం తీసుకున్నాడు. ఆ ఆరు నెలలు మౌన దీక్ష చేపట్టాడు. కేదార్‌నాథ్‌లోని శంకరాచార్యుల విగ్రహం, ఢిల్లీలోని ఇండియా గేట్‌ దగ్గరున్న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహాలను కూడా అరుణ్‌ యోగిరాజ్‌ రూపొందించాడు. అయోధ్యలోని విగ్రహం 51 అడుగులు ఉంది. కమలంపై నిలబడ్డ రాముడి చుట్టూ దశావతరాలు ఉన్న విషయం తెలిసిందే. 'రాయిలో భావం ఒలికించడం చాలా కష్టం. దీనికోసం చాలా సమయం వెచ్చించా. చిన్నపిల్లలు ఎలా ఉంటారో గమనించి అదే మాదిరి రాముడి విగ్రహం పసిదనం వచ్చేందుకు ప్రయత్నించా. కళ్లు బాగున్నాయా అని పదే పదే అడిగి తెలుసుకుని చెక్కా' అని ఇటీవల మీడియాతో మాట్లాడుతూ అరుణ్‌ తెలిపాడు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook