Security up at Mukesh Ambani's House: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద భద్రతను భారీగా పెంచారు పోలీసులు. ఇద్దరు అనుమానిత వ్యక్తులు ఓ ట్యాక్సీ డ్రైవర్​ను ముకేశ్ అంబానీ ఇంటి అడ్రస్ అడిగారనే సమాచారంతో ముందస్తు చర్యలు చేపట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ డ్రైవర్ ఏ చెప్పాడంటే..


ఇద్దరు వ్యక్తులు ఓ బ్యాగ్​ను వెంటబెట్టుకుని.. అంబానీ ఇంటి అడ్రస్ అడిగినట్లు ఓ ట్యాక్సీ డ్రైవర్ పోలీసులకు ఫోన్​ ద్వారా తెలిపాడు. దీనితో ఆ డ్రైవర్ స్టేట్​మెంట్​ను రికార్డ్​ చేసి.. అంబానీ నివాసం (ఆంటిలియా) వద్ద వెంటనే సెక్యూరిటీని పెంచారు పోలీసులు.



సీసీటీవీ దృష్యాల ఆధారంగా ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరనేది కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ముకేశ్ అడ్రస్ ఎందుకు అడిగారో తెలుసుకునే పనిలో పడ్డారు.


Also read: Mukesh Ambani: ముకేశ్ అంబానీ ఫ్యామిలీ లండన్‌కు మకాం మారుస్తున్నారా.. ఆ ప్రాపర్టీ అందుకే కొనుగోలు చేశారా?


Also read: Former MP assaulted: తాగిన మత్తులో గుర్తు తెలియని ఇంటికెళ్లిన మాజీ ఎంపీ- చితక బాదిన ఓనర్​!


ఫిబ్రవరిలో పేలుడు పదార్థాల కలకలం..


ముకేశ్​ అంబానీ నివాసం సమీపంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. పేలుడు పదార్థాలు ఉన్న ఓ కారును గుర్తించారు అంబానీ ఇంటి సమీపంలో గుర్తించారు పోలీసులు. ఈ వాహనాన్ని తొలుత ఆయన భద్రతా సిబ్బంది కనుగొన్నారు. ముకేశ్‌ నివాసం వద్దకు చేరుకున్న బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు..పేలుడు పదార్థాలను జిలెటిన్‌ స్టిక్స్‌గా గుర్తించాయి.


Also read: Uphaar tragedy : ఉపహార్ థియేటర్ విషాదం... Ansal brothers కు ఏడేళ్ల జైలు శిక్ష


అదే వాహనంలో అంబానీ దంపతులను హెచ్చరిస్తున్నట్లు ఓ లేఖ కూడా లభ్యమైంది. దీనితో ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకున్న పోలీసులు విచారణ చెపట్టారు. దీనిపై ఎన్​ఐఏ దర్యాప్తు చేస్తోంది.


ఈ కేసులో పోలీస్ అధికారి సచిన్ వాజే ప్రమేయం ఉందని గుర్తించిన ఎన్ఐఏ అధికారులు అతనిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు ఇంకా విచారణ దశలో ఉండగానే మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. ఈ కేసు రాజకీయంగా కూడా సంచలనం సృష్టించింది.


Also read:US Travel Curbs Lifted: ఆంక్షల ఎత్తివేతతో అమెరికా-భారత్​ మధ్య ప్రయాణాలు పునఃప్రారంభం


Also read: Padma Awards 2021: పద్మ అవార్డుల ప్రదానోత్సవం... PV Sindhu కు పద్మ భూషణ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook