Former MP assaulted: తాగిన మత్తులో గుర్తు తెలియని ఇంటికెళ్లిన మాజీ ఎంపీ- చితక బాదిన ఓనర్​!

Former MP assaulted:  తమిళనాడులో ఓ మాజీ ఎంపీ తాగిన మైకంలో గుర్తు తెలియని ఇంటికెళ్లి సమస్యల్లో చిక్కుకున్నారు. వచ్చిందెవరో ఎవరో తెలియక ఆ ఇంటి ఓనర్​ మాజీ ఎంపీని చితక బాదాడు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2021, 02:06 PM IST
  • మద్యం మత్తులో తెలియని వాళ్ల ఇంటికెళ్లిన మాజీ ఎంపీ
  • అతనెవరో తెలియక చితక బాదిన ఇంటిన ఓనర్​
  • తమిళనాడులో శుక్రవారం జరిగిన ఘటన
Former MP assaulted: తాగిన మత్తులో గుర్తు తెలియని ఇంటికెళ్లిన మాజీ ఎంపీ- చితక బాదిన ఓనర్​!

Former MP Gopalakrishnan: ఎవరైనా తాగి వేరే ఇంటికి వెళ్లి రచ్చ చేయడం మనం సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం. ఇటీవల అలాంటి ఘటన నిజంగానే జరిగింది. తాగి వేరే వాళ్ల ఇంటికి వెళ్లిన ఓ వ్యక్తిని ఆ ఇంటి యజమాని చితక బాదాడు.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆ వెళ్లిన వ్యక్తి అందరిలా సాధారణ వ్యక్తి కాదు. ఓ పేరున్న రాజకీయ నాయకుడు. పార్లమెంట్ మాజీ సభ్యుడు (Former MP enter into Unknown House) కావడం గమనార్హం. ఇదంతా జరిగింది తమిళనాడులో.

దాడి చేసిన ఆ ఇంటి ఓనర్​ తమ ఇంటికి వచ్చింది మాజీ ఎంపీ అని (Former MP assaulted) తెలియదని చెప్పాడు.. గాయ పడిన మాజీ ఎంపీ సైతం తనపై గుర్తు తెలియని వ్యక్తి  దాడి చేశారని చెప్పుకొచ్చారు.

Also read: Mumbai Cruise Drug Case: ఆర్యన్ ఖాన్ కేసు విచారణ నుంచి వాంఖడేను తొలగించిన ఎన్సీబీ

Also read: Tragedy on Diwali: స్కూటీలో టపాసులు తీసుకెళ్తుండగా భారీ పేలుడు.. తండ్రి, కొడుకు మృతి

అసలేమైందంటే..

అన్నాడీఎంకే మాజీ ఎంపీ గోపాలకృష్ణన్​ (AIDMK leader Gopala Krishnan) దీపావళి పండుగరోజు మద్యం సేవించి.. మత్తులో మదురై నీలగిరి ముత్యాలమ్మన్‌పేట్‌లోని ఓ నివాసంలోకి ప్రవేశించారు. దీనితో ఆయన ప్రవర్తనపై ఆగ్రహించిన ఇంటి ఓనర్.. గోపాలకృష్ణన్​పై దాడి చేశాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు.

తమ ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించడం వల్లే.. దాడి చేసినట్లు స్పష్టం చేశాడు ఆ ఇంటి ఓనర్​. అయితే ఆయన మాజీ ఎంపీ అని తమకు తెలియదని సమాధానమిచ్చాడు. 

Aslo read: Mukesh Ambani: ముకేశ్ అంబానీ ఫ్యామిలీ లండన్‌కు మకాం మారుస్తున్నారా.. ఆ ప్రాపర్టీ అందుకే కొనుగోలు చేశారా?

గోపాలకృష్ణన్ ప్రస్తుతం కూనూర్​లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి గురించి స్పందించిన ఆయన.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తనపై దాడి చేసినట్లు చెప్పడం గమనార్హం.

గోపాలకృష్ణన్ 2014 నుంచి 19 వరకు నీలగిరి నియోజకవర్గం నుంచి లోక్​ సభ ఎంపీగా ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read: Maharastra: ఐసీయూలో అగ్నిప్రమాదం...ఆరుగురు కరోనా రోగులు మృతి!

Also read: Edible Oil Price Reduced: దేశంలో భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు.. లీటరుకు రూ.5 నుంచి రూ.20 తగ్గింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News