New Attorney General: భారత కొత్త అటార్నీ జనరల్ (ఏజీ)గా సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణి నియమితులయ్యారు. ఆయన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడేళ్ల కాలానికి నియమించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. సెప్టెంబర్ 30న పదవీకాలం ముగియనున్న కె.కె.వేణుగోపాల్ స్థానంలో శ్రీ వెంకటరమణి బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఏజీ పదవిని చేపట్టాలని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని కేంద్రప్రభుత్వం అడిగింది. ఆ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. వెంకటరమణికి సుప్రీంకోర్టులో నాలుగు దశాబ్దాల పాటు పనిచేసిన అనుభవం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోహత్గీ 2014 జూన్‌ 19 నుంచి 2017 జూన్‌ 18 వరకు అటార్నీ జనరల్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. అప్పుడు కూడా రెండోసారి కొనసాగించడానికి కేంద్ర ప్రయత్నించగా ఆయన తిరస్కరించారు. అనంతరం ఆయన స్థానంలో కేకే వేణుగోపాల్‌ మూడేళ్ల కాలానికి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన పదవీ కాలాన్ని మరో రేండేళ్లు పొడిగించింది. ఈ నెల 30తో ఆయన పదవీ కాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో తదుపరి అటార్నీ జనరల్ గా వెంకటరమణి ఎంపిక చేసింది ప్రభుత్వం. 


వెంకటరమణి జూలై 1977లో తమిళనాడు బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు మరియు 1979లో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. 1997లో సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డారు. 2010లో వెంకటరమణి లా కమిషన్ సభ్యునిగా నియమింపబడ్డారు. 2013లో మళ్లీ తిరిగి నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధిన కీలక కేసుల్లో ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల్లో  తన వాదనలు వినిపించారు. 


Also Read: Free Condoms Controversy: రేపు కండోమ్స్ కూడా అడుగుతారు.. విద్యార్థినిపై మండిపడిన ఐఏఎస్ ఆఫీసర్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook