Covavax: పుణేకు చెందిన సీరమ్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్​ఐఐ) నుంచి మరో కొవిడ్ వ్యాక్సిన్​ అందుబాటులోకి (New corona vaccine) రానుంది. ఈ వ్యాక్సిన్​ అత్యవస వినియోగానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్​ (డబ్ల్యూహెచ్​ఓ) ఆమోదముద్ర వేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికాకు చెందిన నోవావాక్స్​ భాగస్వామ్యంతో సీరమ్​ ఈ వ్యాక్సిన్​ను అభివృద్ధి చేస్తోంది. దీనికి కోవావాక్స్​ (COVOVAX) అని పేరు పెట్టారు.


అల్పాదాయ దేశాల్లో టీకా లభ్యత పెంచేందుకు గాను ఈ వ్యాక్సిన్​కు డబ్ల్యూహెచ్​ఓ (WHO Gives nod to Covovax) అనుమతి మంజూరు చేసింది. అత్యవసర వినియోగం కోసం డబ్ల్యూహెచ్​ఓ అనుమతించిన 9వ వ్యాక్సిన్​ ఇది. దీనితో ఈ వ్యాక్సిన్ త్వరలోనే వినియోగంలోకి రానుంది. భారత్​లో ప్రస్తుతం కొవాగ్గిజన్​, కొవిషీల్డ్, స్పుత్నిక్ వ్యాక్సిన్​లు వినియోగంలో ఉన్నాయి. ఇందులోన కొవిషీల్డ్​ను కూడా సీరమ్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియానే అభివృద్ధి చేస్తుండటం గమనార్హం.


కోవావాక్స్ గురించి..


ఈ ఏడాది తొలినాళ్లలోనే ఈ వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాలు నిర్వహించింది నోవావాక్స్​. ఇందులో ఈ వ్యాక్సిన్​ కొవిడ్​ 19పై 96.4 శాతం ప్రభావవంతగా పని చేసినట్లు తేలింది. ఒక్క డోసు ద్వారానే 83.4 శాతం ప్రభావశీలత కనిపించినట్లు అప్పట్లో వెల్లడించింది నోవావాక్స్.


అదర్ పునావాలా..


కోవావాక్స్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్​ఓ (Covovax gets WHO nod) అనుమతించిన నేపఫథ్యంలో సీరమ్​ సీఈఓ అదర్ పునావాలా హర్షం వ్యక్తం చేశారు. కొవిడ్​పై పోరాటంలో ఇది మరో మైలురాయి అని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాక్సిన్ అద్భుతంగా పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.



Also read: Omicron Cases: భారత్‌లో ఒమిక్రాన్‌ విజృంభన, 109 కి చేరిన కేసులు..జాగ్రత్త అంటోన్న కేంద్రం


Also read: Omicron : ఒమిక్రాన్‌ వల్ల దేశంలో మళ్లీ లాక్‌డౌన్? న్యూ ఇయర్ వేడుకలు లేనట్లేనా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook