Road accident - Seven killed, one injured: సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh) లోని మండిలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి నదిలో పడటంతో ఏడుగురు దుర్మరణం చెందగా (road accident).. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘోర ప్రమాదం చండీఘడ్-మనాలీ జాతీయ రహదారిపై మండి జిల్లాలోని పుల్‌ఘ్రాత్‌ ప్రాంతంలో (Pullghrat area ) జరిగింది. ఏడుగురు ప్రయాణికులతో వెళ్తున్న జీపు సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వంతెన పైనుంచి సుకేత్ ఖడ్‌ నదిలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించారు. డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయన్ను సమీప ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. Also read: Soumitra Chatterjee: బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ కన్నుమూత


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"198121","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"హిమాచల్ ప్రదేశ్ యాక్సిడెంట్","field_file_image_title_text[und][0][value]":"హిమాచల్ ప్రదేశ్ మండి యాక్సిడెంట్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"హిమాచల్ ప్రదేశ్ యాక్సిడెంట్","field_file_image_title_text[und][0][value]":"హిమాచల్ ప్రదేశ్ మండి యాక్సిడెంట్"}},"link_text":false,"attributes":{"alt":"హిమాచల్ ప్రదేశ్ యాక్సిడెంట్","title":"హిమాచల్ ప్రదేశ్ మండి యాక్సిడెంట్","class":"media-element file-default","data-delta":"1"}}]]సమాచారం అందుకున్న పోలీసులు (Himachal Pradesh Police) సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే జీపు వంతెన పైనుంచి కిందికి పడిపోవడంతో అందులో ఉన్న ఏడుగురు చల్లచదురుగా పడిపోయారని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారంతా బీహార్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. వారంతా పనికోసం ఈ ప్రాంతానికి వచ్చినట్లు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.  Also read: Sabarimala: నేటినుంచి దర్శనమివ్వనున్న అయ్యప్ప స్వామి 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి