దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ గడువును కేంద్రం పొడిగించింది. నేటి ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించినట్లు వెల్లడించారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు సాధ్యమైనన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. మిగతా దేశాల కంటే ముందే అప్రమత్తమై పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు.  ఐపీఎల్‌ మళ్లీ వాయిదా. అసలు జరుగుతుందా?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"184335","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"style":"height: 1020px; width: 900px;","class":"media-element file-default","data-delta":"1"}}]]


ప్రధాని మోదీ తన ప్రసంగంలో సూచించిన 7 ముఖ్యాంశాలు ఇవే...
1. ఇంట్లో ఎవరైనా వ్యాధిగ్రస్తులు, సీనియర్‌ సిటిజన్లు ఉండే వారి పట్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి.
2. లక్ష్మణ రేఖలా భావించి సోషల్‌ డిస్టెన్స్‌ (సామాజిక దూరం) కచ్చితంగా పాటించండి,  ఫేస్‌ మాస్క్‌లు వేసుకోండి.
3. వ్యాధి నిరోధకత పెంచుకునేందుకు ఆయూష్‌ సూచనల్ని అందరూ తప్పకుండా పాటించాలి.
4. ఆరోగ్య సేతు యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. మీతో పాటు స్నేహితులు, సన్నిహితులు ఇన్‌స్టాల్‌ చేసుకునేలా ప్రేరేపించండి.
5. సాధ్యమైనంత వరకు మీ చుట్టూ ఉండే పేదలకు భోజనం అందించేందుకు ప్రయత్నించండి.
6. కంపెనీలు, సంస్థల్లో ఉద్యోగలును తొలగించొద్దు. కష్టకాలంలో అండగా నిలవాలి.
7. కరోనాతో పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, అత్యవసర సిబ్బందిని గౌరవించాలి.      Bikiniలో అందాల భామ హాట్ ఫొటోలు


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos


ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos


 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ