Sharad Yadav`s Death News: శరద్ యాదవ్ మృతి.. రాజకీయ ప్రస్థానం కొనసాగిందిలా
Sharad Yadav`s Death News: కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ ఇక లేరు. గురువారం రాత్రి శరద్ యాదవ్ కన్నుమూసినట్టు ఆయన కూతురు సుభాషిణి యాదవ్ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. గురుగ్రామ్ లోని ఫోర్టిస్ హాస్పిటల్లో శరద్ యాదవ్ తుది శ్వాస విడిచారు.
Sharad Yadav's Death News: కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ ఇక లేరు. గురువారం రాత్రి శరద్ యాదవ్ కన్నుమూసినట్టు ఆయన కూతురు సుభాషిణి యాదవ్ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. గురుగ్రామ్ లోని ఫోర్టిస్ హాస్పిటల్లో శరద్ యాదవ్ తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 75 ఏళ్లు. జనతా దళ్ (యునైటెడ్) పార్టీ మాజీ అధ్యక్షుడిగా, పలు ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా సేవలు అందించిన శరద్ యాదవ్ జాతీయ రాజకీయాల్లో అందరికీ సుపరిచితమే.
27 ఏళ్ల వయస్సులో తొలిసారి ఎన్నికల్లో పోటీ..
1974లో జబల్‌పూర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా అప్పటి రాజకీయాల్లో సంచలన నేతగా పేరున్న జయప్రకాశ్ నారాయణ్ 27 ఏళ్ల యువకుడైన శరద్ యాదవ్‌కి సూచించారు. జయప్రకాశ్ నారాయణ్ అప్పగించిన ఆ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించిన శరద్ యాదవ్.. ఆ ఎన్నికల్లో గెలుపొంది తొలి పోటీలోనే విజయం అందుకున్నారు. అది మొదలు శరద్ యాదవ్ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో విజయాలు వరించాయి.
జనతా దళ్ (యునైటెడ్) బీజేపీతో పొత్తు పెట్టుకోవడాని వ్యతిరేకిస్తూ ఆ పార్టీలోంచి బయటికొచ్చిన శరద్ యాదవ్.. 2018 లో లోక్ తంత్రిక్ జనతా దళ్ పార్టీని స్థాపించారు. అయితే, తాను స్థాపించిన ఆ పార్టీని 2020 లో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీలో విలీనం చేశారు. అధికార పార్టీని ప్రశ్నించేందుకు, ప్రజల కోసం పనిచేసేందుకు ప్రతిపక్షాలు ఏకమవ్వాల్సిన అవసరం ఉందని చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అప్పట్లో శరద్ యాదవ్ అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోదీ సంతాపం..
శరద్ యాదవ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. డా. రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని ప్రజా సేవలో కొనసాగారని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. శరద్ యాదవ్‌కి తనకు మధ్య జరిగిన సంభాషణలు ఎప్పటికీ మర్చిపోలేనని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా శరద్ యాదవ్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు.
ఇది కూడా చదవండి : Budget Facts: దేశపు తొలి బడ్జెట్ , అతి పెద్ద బడ్జెట్ ఎప్పుడు, బడ్జెట్ సంబంధించిన ఆసక్తికర అంశాలు
ఇది కూడా చదవండి : Vandebharat Express: విశాఖపట్నం వరకూ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు, ఎక్కడెక్కడ ఆగుతుందంటే
ఇది కూడా చదవండి : AAP: ఆప్ దృష్టి ఇప్పుడు మహారాష్ట్రపై, త్వరలో బీఎంసీ ఎన్నికల్లో పోటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook