Budget Facts: దేశపు తొలి బడ్జెట్ , అతి పెద్ద బడ్జెట్ ఎప్పుడు, బడ్జెట్ సంబంధించిన ఆసక్తికర అంశాలు

Budget Facts: కేంద్ర బడ్జెట్ మరో 20 రోజుల్లో రానుంది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపధ్యంలో..దేశంలోని బడ్జెట్ సంబంధిత ఆసక్తికర విషయాలున్నాయి. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 10, 2023, 12:45 PM IST
Budget Facts: దేశపు తొలి బడ్జెట్ , అతి పెద్ద బడ్జెట్ ఎప్పుడు, బడ్జెట్ సంబంధించిన ఆసక్తికర అంశాలు

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన తన ఐదవ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్ధిక సంవత్సరం 2023-24 ఆర్ధిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపధ్యంలో దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. 

భారతావని తొలి బడ్జెట్

భారతదేశపు తొలి బడ్జెట్ 1860 ఏప్రిల్ 7వ తేదీన ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతావని తొలి బడ్జెట్ మాత్రం 1947 నవంబర్ 26న అప్పటి ఆర్ధిక మంత్రి ఆర్కే షణ్ముఖం చెట్టి ప్రవేశపెట్టారు. 

అతి పెద్ద బడ్జెట్

2020 ఫిబ్రవరి 1వ తేదీన 2020-21 సంవత్సరపు బడ్జెట్ ప్రవేశపెడుతూ ఏకంగా 2 గంటల 42 నిమిషాలసేపు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఇదే దేశంలో అతిపెద్ద బడ్జెట్‌గా ఉంది. జూలై 2019లో తన రికార్డును ఈ సందర్భంగా ఆమె స్వయంగా బద్దలుగొట్టారు. అప్పట్లో అంటే 2019 లో 2 గంటల 17 నిమిషాలసేపు బడ్జెట్ ప్రసంగం సాగింది.

బడ్జెట్ ప్రసంగంలో ఎక్కువ పదాలు

1991లో నరశింహారావు ప్రభుత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్ 18,650 పదాల్లో అతిపెద్ద బడ్జెట్‌గా ఉంది. 2018లో అప్పటి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ 18,604 పదాలతో బడ్జెట్ సమర్పించారు. ఇది రెండవ అతిపెద్ద బడ్జెట్.

అతి చిన్న బడ్జెట్

1977లో అప్పటి ఆర్ధిక శాఖ మంత్రి హీరూభాయి ముల్జీభాయి కేవలం 800 పదాలతో చిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు.

ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు

దేశ చరిత్రలో అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ పేరుతో ఉంది. 1962-69 సందర్భంగా ఆర్ధికమంత్రిగా తన పదవీకాలంలో పదిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తరువాత అత్యధికసార్లు చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్ వస్తారు. 

పేపర్‌లెస్ బడ్జెట్

స్వతంత్ర భారతదేశంలో తొలిసారి కోవిడ్ 19 మహమ్మారి నేపద్యంలో 2021-22 బడ్జెట్‌ను పేపర్‌లెస్‌గా డిజిటల్ రూపంలో ప్రవేశపెట్టారు.

మహిళా ఆర్ధికమంత్రి

2018లో ఇందిరాగాంధీ తరువాత బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రమే. ఇందిరాగాంధీ తొలిసారి 1970-71 బడ్జెట్ ప్రవేశపెట్టారు. 

2017 వరకూ రైల్వే బడ్జెట్, ఆర్ధిక బడ్జెట్ వేర్వేరుగా ఉండేవి. 92 ఏళ్ల ఇలానే సాగింది. 2017లో తొలిసారి రెండు బడ్జెట్‌లను కలిపేశారు. అప్పట్నించి ఒకే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.

Also read: Vistara Airlines: విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ప్రత్యేక ఆఫర్లు, డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ 1899 రూపాయలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News