Shiv Sena: బెంగాల్ బరిలో శివసేన
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వెడెక్కుతున్నాయి. ఇప్పటికే ఇటు బీజేపీ, టీఎంసీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన కీలక నిర్ణయం తీసుకుంది.
Shivsena has decided to contest the West Bengal Assembly Elections | న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వెడెక్కుతున్నాయి. ఇప్పటికే ఇటు బీజేపీ, టీఎంసీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో బెంగాల్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు శివసేన (Shiv Sena) ఆదివారం వెల్లడించింది. సీఎం మమతాబెనర్జీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య ప్రధాన పోటీ ఉన్నా.. త్వరలో జరిగే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని శివసేన ప్రకటించింది.
ఈ మేరకు శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) తో చర్చల అనంతరం ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) ట్విట్టర్ వేదికగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. త్వరలోనే తమ పార్టీ అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కోల్‌కతాలో పర్యటిస్తారని ఆయన ట్వీట్ చేశారు. Also Read: West Bengal: మంత్రి రాజీనామా.. ఎవరైనా వెళ్లొచ్చు: సీఎం మమతా
అయితే పశ్చిమ బెంగాల్ (West Bengal) లో 100 సీట్లలో పోటీ చేయాలని శివసేన నిర్ణయించుకున‌్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఈ నెల 29న పార్టీ శ్రేణులతో భేటీ అయ్యేందుకు శివసేన నేత ఎంపీ అనిల్ దేశాయి కోల్‌కతా వెళ్లనున్నారు. ఇదిలాఉంటే.. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 22 చోట్ల అభ్యర్థులను పోటీలో నిలిపిన శివసేన ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. Also Read: West Bengal: మమతా కీలక నిర్ణయం.. తెలుగు భాషకు అధికార హోదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook