West Bengal: మంత్రి రాజీనామా.. ఎవరైనా వెళ్లొచ్చు: సీఎం మ‌మ‌తా

పశ్చిమ‌ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆ రాష్ట్ర రాష్ట్ర ముఖ్య‌మంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి మ‌రో షాక్ త‌గిలింది.

Last Updated : Jan 5, 2021, 05:02 PM IST
  • పశ్చిమ‌ బెంగాల్ ముఖ్య‌మంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి మ‌రో షాక్ త‌గిలింది.
  • రాష్ట్ర క్రీడా, యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ స‌హాయ మంత్రి, టీమిండియా మాజీ క్రికెట‌ర్ ల‌క్ష్మీర‌త‌న్ శుక్లా మంగళవారం త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు.
  • హౌరా జిల్లా టీఎంసీ (TMC) అధ్య‌క్ష ప‌ద‌వికి సైతం రాజీనామా చేశారు.
West Bengal: మంత్రి రాజీనామా.. ఎవరైనా వెళ్లొచ్చు: సీఎం మ‌మ‌తా

Bengal Sports Minister Laxmi Ratan Shukla resigns | కోల్‌క‌తా: పశ్చిమ‌ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆ రాష్ట్ర రాష్ట్ర ముఖ్య‌మంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి మ‌రో షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే టీఎంసీ కీల‌క నేత సువేందు అధికారి స‌హా ప‌లువురు నేత‌లు పార్టీని వీడి బీజేపీ (BJP) లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రాష్ట్ర మంత్రి, టీఎంసీ కీలక నేత సైతం పార్టీని వీడారు. 

పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్ర క్రీడా, యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ స‌హాయ మంత్రి, టీమిండియా మాజీ క్రికెట‌ర్ ల‌క్ష్మీర‌త‌న్ శుక్లా మంగళవారం త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతోపాటు ఆయన (Laxmi Ratan Shukla) హౌరా జిల్లా టీఎంసీ (TMC) అధ్య‌క్ష ప‌ద‌వికి సైతం రాజీనామా చేశారు. అయితే ఎమ్మెల్యే ప‌ద‌వికి మాత్రం ఆయ‌న రాజీనామా చేయ‌లేదు. ల‌క్ష్మీర‌త‌న్ శుక్లా త్వరలోనే బీజేపీలో చేరే అవకాశముందని సమాచారం. Also Read: Kumbh Mela 2021: జనవరి 14న కుంభమేళా ప్రారంభం.. గంగానదీ స్నానాల ప్రాముఖ్యత తెలుసా?

ఎవరైనా రాజీనామా చేయొచ్చు.. మమతా
ఇదిలాఉంటే.. ల‌క్ష్మీర‌త‌న్ శుక్లా రాజీనామాపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించారు. ఎవ‌రైనా ఎప్పుడైనా రాజీనామా చేయ‌వ‌చ్చ‌ని, ఎవ‌రి ఇష్టానుసారం వారు నడుచుకునే స్వేచ్ఛ ఉంటుంద‌ని మ‌మ‌తా పేర్కొన్నారు. అయితే ఎక్కువ స‌మ‌యం క్రీడలకు కేటాయించాల‌న్న ఉద్దేశంతో తాను మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాన‌ని, ఎమ్మెల్యేగా మాత్రం కొన‌సాగుతాన‌ని లక్ష్మీరతన్ శుక్లా రాజీనామా లేఖ‌లో పేర్కొన్న‌ారని మ‌మ‌తా వెల్ల‌డించారు. దీనిని నెగెటివ్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని మ‌మ‌త పేర్కొన్నారు. Also Read: 
West Bengal: మమతా కీలక నిర్ణయం.. తెలుగు భాషకు అధికార హోదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News