Sanjay Raut Viral Dance: పెళ్లి వేడుకలో పార్లమెంట్ సభ్యులు సంజయ్ రౌత్, సుప్రియా డ్యాన్స్.. వీడియో వైరల్
Sanjay Raut Viral Dance: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేతో కలిసి ‘లాంబోర్గిని’ పాటకు సంజయ్ రౌత్ డ్యాన్స్ చేయగా.. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Sanjay Raut Viral Dance: మహారాష్ట్రలోని శివసేన పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు సంజయ్ రౌత్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆయన కుమార్తె పూర్వశి రౌత్ పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేసిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆయనతో పాటు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పార్లమెంట్ సభ్యురాలు సుప్రియా సూలే స్టెప్పులు వేశారు. వీరిద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది ట్రెండింగ్ గా మారింది.
అయితే ఇందులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తో కలిసి డ్యాన్స్ చేసిన సుప్రియా సూలే మరెవరో కాదు.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె. సంజయ్ రౌత్ కుమార్తె పూర్వశి రౌత్ పెళ్లి సంగీత్ వేడుకలో ’లంబోర్గిని’ అనే పాటకు స్టెప్పు లేశారు.
సంజయ్ రౌత్ కుమార్తె పూర్వశి రౌత్ పెళ్లి సంగీత్ వేడుక సోమవారం రాత్రి (నవంబరు 29) జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులు సహా పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. సంగీత్ లో సంజయ్ రౌత్ కోరిక మేరకు సుప్రియా సూలే ఆయనతో కలిసి డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది.
అంతకు ముందు ఈ పెళ్లికి హాజరైన సుప్రియా సూలే.. ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలను షేర్ చేశారు. వధూవరులతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేశారు. అయితే మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకను నిర్వహించినట్లు కొందరు నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు.
కొన్ని వార్తా సంస్థల నివేదిక ప్రకారం సంజయ్ రౌత్ కుమార్తె పూర్వశి రౌత్ వివాహం సివిల్ సర్వెంట్ రాజేష్ నార్వేకర్ కుమారుడు మల్హర్ నర్వేకర్ తో జరిగింది. మల్హర్ ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారని తెలుస్తోంది.
Also Read: Ghaziabad: భర్త ఉద్యోగానికి వెళ్లగానే..ప్రియుడితో భార్య నగ్న వీడియో కాల్...!
Also Read: Rajya Sabha MP Suspension: పార్లమెంట్ సమావేశాల తొలి రోజే 12 మంది ఎంపీలు సస్పెండ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook