శివసేన.. గతకొన్ని సంవత్సరాలుగా బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ.. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంది. అయితే గడిచిన సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి శివసేన బీజేపీకి దూరంగానే ఉంటూ వస్తోంది. సొంత పత్రిక సామ్నా లోనూ బీజేపీ, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించింది. 


మోదీ ప్రధాని అయ్యాక శివసేన, బీజేపీ మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. రెండుపార్టీల మధ్య దూరం కూడా పెరిగింది. 2019లో జరిగే లోక్ సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఒంటరి పోరులో నిలబడుతుందని.. ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ వెల్లడించారు. రెండు పార్టీలు 2017లో జరిగిన బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయగా.. శివసేన 84, బీజేపీ 82 స్థానాల్లో విజయం సాధించాయి. ఒంటరిగా పోటీ చేస్తే లోక్ సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం వరిస్తుందని శివసేన భావిస్తోంది.