Shiv Sena: శివసేనలో పొలిటికల్ వార్ తార స్థాయికి చేరింది. పార్టీ హక్కు కోసం ఆ పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే, తిరుగుబాటు నేత, సీఎం ఏక్‌నాథ్‌ షిండే మధ్య పోరు నెలకొంది. పార్టీ తమదంటే తమదని రెండు వర్గాలు అంటున్నాయి. శాసనసభా పక్షంలో చీలిక వచ్చినా..పార్టీ అలాగే ఉంటుందని ఉద్దవ్ ఠాక్రే వర్గం చెబుతోంది..మెజార్టీ ఎవరిది ఉంటే వారిదే పార్టీ అని షిండే వర్గం కుండబద్దలు కొడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈక్రమంలో ఈపంచాయతీ ఎన్నికల సంఘం వద్దకు చేరింది. అసలైన శివసేన తమదేనని..నియంత్రణ తమకు అప్పగించాలని షిండే వర్గం ఈసీకి లేఖ రాసింది. ఈనేపథ్యంలో ఈసీ స్పందించింది. శివసేన పార్టీ కోసం ఇరువర్గాలు మెజార్టీ నిరూపించుకోవాలని స్పష్టం చేసింది. ఆగస్టు 8లోగా అందుకు సంబంధించిన పత్రాలు సమర్పించాలని ఆదేశించింది. 


ఇటీవల ఉద్దవ్ ఠాక్రేపై ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు చేశారు. వీరంతా ఏక్‌నాథ్‌ షిండేకు సపోర్ట్ ఇచ్చారు. వీరంతా కొన్నిరోజులపాటు గౌహతి, గోవా ప్రాంతాల్లో బస చేశారు. దీంతో ప్రభుత్వం కూలే పరిస్థితి రావడంతో ఠాక్రే ..సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈక్రమంలో ముంబై చేరుకున్న షిండే..బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు. 


ఈక్రమంలో శివసేనలో పార్టీ కోసం పోరు మొదలైంది. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు షిండే వర్గంలోనే ఉన్నారు. ఎంపీలు సైతం ఉద్దవ్‌పై తిరుగుబాటు చేశారు. 15 మంది ఎంపీలంతా షిండే వర్గంలో చేరారు. దీంతో శివసేన రెండు ముక్కలైంది. పార్టీ గుర్తు కోస షిండే వర్గం..ఈసీని ఆశ్రయించింది. ఈక్రమంలోనే ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు శివసేన..ఠాక్రే నుంచి జారిపోవడంతో ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపీలు షిండేకే మద్దతు తెలుపుతున్నారు. త్వరలో శివసేన సంక్షోభంపై క్లారిటీ రానుంది.


Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలను వీడని వానలు..మరోమారు రెయిన్ అలర్ట్ జారీ..!


Also read:Minister Roja: విపక్షాలను గడగడలాడించే రోజాకు సొంత పార్టీలో ఇన్ని కష్టాలా? సీఎం జగన్ ఏం చేస్తారో మరీ.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.