Emergency 1975: ఇందిరా గాంధీ ఎమర్జెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్
Emergency 1975: మహారాష్ట్రలో కాంగ్రెస్ , ఎన్సీపీ బంధం పటిష్టమవుతోందా..పరిస్థితి చూస్తుంటే అదే అన్పిస్తోంది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ సీనియర్ నేతల్ని శివసేన వెనుకేసుకురావడం దీనికి నిదర్శనంగా కన్పిస్తోంది.
Emergency 1975: మహారాష్ట్రలో కాంగ్రెస్ , ఎన్సీపీ బంధం పటిష్టమవుతోందా..పరిస్థితి చూస్తుంటే అదే అన్పిస్తోంది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ సీనియర్ నేతల్ని శివసేన వెనుకేసుకురావడం దీనికి నిదర్శనంగా కన్పిస్తోంది.
మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ( Maharashtra government) ఏర్పడినప్పటి నుంచీ పరిస్థితులు, సమీకరణాలు, నేతల వ్యాఖ్యలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా శివసేన-కాంగ్రెస్ పార్టీల మధ్య సాన్నిహత్యం పెరుగుతున్నట్టు అన్పిస్తోంది. గతంలో ఓసారి రాహుల్ గాంధీని వెనకేసుకు రావడం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఇందిరా గాంధీని సమర్దిస్తూ శివసేన ముఖ్యనేత, పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకూ నాటి ఎమర్జెన్సీపై బీజేపీ(BJP)తో సమానంగా విమర్శలు చేసిన శివసేన పార్టీ(Shiv sena)..ఇప్పుడు హఠాత్తుగా స్వరం మార్చింది.
1975లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి అనేది కాలదోషం పట్టిన అంశమని శివసేన ముఖ్యనేత సంజయ్ రౌత్(Shivsena mp sanjay raut) వ్యాఖ్యానించారు. దేశంలో ప్రస్తుత పరిణామాల్ని చూస్తుంటే నాటి పరిస్థితులో నయమన్పిస్తోందన్నారు. అప్పటి ప్రధాని, తన నానమ్మ ఇందిరా గాంధీ(Indira gandhi) దేశంలో ఎమర్జెన్సీ విధించడం తప్పేనని రాహుల్ గాంధీ ఇటీవల ఒప్పుకోవడంపై శివసేన ముఖపత్రిక సామ్నా(Samna)లో సంజయ్ రౌత్ ప్రశ్నించారు. అత్యవసర పరిస్థితి విధించినందుకు ప్రజలామెను శిక్షించారు. ఓ గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. అయితే అదే ప్రజలు ఆమెను క్షమించి తరువాత తిరిగి అధికారం కట్టబెట్టారని చెప్పారు. అసలు ఎమర్జెన్సీ(Emergency) అనేది ముగిసిన అధ్యాయమని..మళ్లీ ఎందుకు గుర్తు చేయడమని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi)సూటిగా, స్పష్టంగా మాట్లాడే వ్యక్తి అంటూ కితాబిచ్చారు. మీడియా సంస్థలపై ఆధిపత్యం చెలాయించడం, ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ వ్యూహాలు పన్నడం , ప్రతిపక్షాల్లో విభేదాలు పెంచడం, రాజ్యాంగ సూత్రాల్ని ఉల్లంఘించడం..ఇవన్నీ 1975లో జరిగినట్టే ఇప్పుడూ జరుగుతున్నాయన్నారు. నాడు ఇందిరాగాంధీ స్థానంలో ఇప్పుడు నరేంద్ర మోదీ ఉన్నారని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook