Remdesivir: ఆకాశాన్నంటుతున్న కరోనా మందు ధర
కరోనా వైరస్ ( Corona virus ) ఓ వైపు విజృంభిస్తుంటే మరోవైపు ముఖ్యమైన ఔషధంగా భావిస్తోన్న రెమిడెసివిర్ ధర ఆకాశాన్నంటుతోంది. డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడంతో ఈ మందు బ్లాక్ మార్కెట్ కు తరలిపోతోంది. ముఖ్యంగా కరోనా వైరస్ కేసులు అధికంగా ఉన్న ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా మారింది.
కరోనా వైరస్ ( Corona virus ) ఓ వైపు విజృంభిస్తుంటే మరోవైపు ముఖ్యమైన ఔషధంగా భావిస్తోన్న రెమిడెసివిర్ ధర ఆకాశాన్నంటుతోంది. డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడంతో ఈ మందు బ్లాక్ మార్కెట్ కు తరలిపోతోంది. ముఖ్యంగా కరోనా వైరస్ కేసులు అధికంగా ఉన్న ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా మారింది.
కరోనా వైరస్ కు ఆశాజనకంగా భావిస్తోన్న రెమిడెసివిర్ ( Remdesivir ) ధర చుక్కలనంటుతోంది. యాంటీ వైరల్ డ్రగ్ ( Anti viral drug ) గా ప్రాచుర్యంలో ఉన్న ఈ మందును కోవిడ్ 19 చికిత్స ( Covid19 treatment ) లో ప్రస్తుత పరిస్థితిలో అధికంగా వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకూ ఇండియాలో కేవలం మూడే కంపెనీలు ఈ మందును మార్కెట్ చేస్తుండటంతో కొరత తీవ్రంగా ఉంది. డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా ఉంది. కరోనా హాట్ స్పాట్ గా మారిన ఢిల్లీలో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కరోనా పాజిటివ్ రోగుల్లో మధ్యస్థంగా లక్షణాలున్నవారికి వైద్యులు ఎక్కువగా ఇదే మందును రిఫర్ చేస్తున్నారు. Also read: Vikas Dubey Before Arrest: వికాస్ దుబే అరెస్టుకు ముందు జరిగిన పరిణామాలు
యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్ పేటెంట్ కంపెనీ గిలియాడ్ సైన్సెస్ ( Gilead sciences ) తో భారత్ కు చెందిన కొన్ని కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. వీటిలో హెటిరో డ్రగ్స్ ( Hetero drugs ) , సిప్లా ( Cipla ) , మైలాన్ ( Mylan ) కంపెనీలకు డ్రగ్ డీసీజీఐ ( DCGI ) నుంచి అనుమతులు కూడా వచ్చాయి. దీంతో ఇండియాలో ఈ మూడు కంపెనీలే రెమిడెసివిర్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. హెటిరో డ్రగ్స్ సంస్థ ఒక్క వయల్ ధరను 5 వేల 4 వందలకు అందిస్తుండగా...మైలాన్, సిప్లా కంపెనీలు 5 వేలకు అందిస్తున్నాయి. అయితే ఇండియాలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. కానీ ప్రదాన చికిత్సగా ఉన్న రెమ్ డెసివిర్ మందు మాత్రం డిమాండ్ కు తగ్గట్టుగా సరఫరా చేయలేకపోతున్నాయి. దాంతో 5 వేల రూపాయలున్న వయల్ ధర బ్లాక్ మార్కెట్ లో ఆకాశాన్నంటుతోంది. పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు ధరల్ని పెంచేస్తున్నారు బ్లాక్ మార్కెటర్లు. ఒక్కో వయల్ 30 వేల నుంచి 65 వేలకు కూడా అమ్మడైన సందర్భాలున్నాయని తెలుస్తోంది. Also read: Covid-19 First Vaccine: కరోనావైరస్ తొలి వ్యాక్సిన్ ఇతనికే
గిలియడ్ సైన్సెస్ ( Gilead Sciences ) నుంచి ఒప్పందు ఖరారు చేసుకుని డీసీజీఐ అనుమతి కోసం మరో మూడు కంపెనీలు వేచి చూస్తున్నాయి. వీటిలో జుబిలియంట్ ( Jubilant ) , రెడ్డీ ల్యాబ్స్ ( Reddy labs ) , బీడీఆర్ ( BDR ) సహా మరి కొన్ని సంస్థలున్నాయి.వీటికి కూడా అనుమతులు లభిస్తే సరఫరా కాస్త పెరుగుతుంది. తద్వారా ధరలు అందుబాటులో రాగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు. రెమిడెసివిర్ మందును హోల్ సేల్ గా కొనుగోలు చేయడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు కంపెనీలకు వివిధ రాష్ట్రాల్నించి పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చి ఉన్నాయి. ఈ నేపధ్యంలో బయటి మార్కెట్ లో మందు లభ్యత కష్టతరంగా మారింది. దీన్ని అవకాశంగా తీసుకుని బ్లాక్ మార్కెటర్లు రెచ్చిపోతున్నారు. Also read: H1B Visa: ఇండియాకు ప్రారంభమైన వలసలు
దాంతో ఇప్పుడు డీసీజీఐ రంగంలో దిగింది. బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. సాధ్యమైనంత త్వరలో జుబిలియంట్, రెడ్డీ ల్యాబ్స్, బీడీఆర్ కంపెనీలకు కూడా అనుమతులు ఇవ్వడం ద్వారా రెమిడెసివిర్ కొరతను అధిగమించడానికి అధికారులు యోచిస్తున్నారు.