Pran Pratistha: అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుక సందర్భంగా చాలా రాష్ట్రాలు సోమవారం సెలవును ప్రకటించాయి. కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించాలని సర్వత్రా డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ డిమాండ్‌పై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ స్పందించారు. బెంగళూరులోని తన నివాసంలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. మతం, భక్తి గురించి ఎవరితోనో చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ప్రాణ ప్రతిష్టాపన వేడుక రాష్ట్ర ప్రభుత్వం సెలవు ఇవ్వకపోవడం సమంజసమేనని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామ మందిర ప్రతిష్టాపన అంశాన్ని వాళ్లు రాజకీయం చేస్తున్నారని డీకే శివ కుమార్‌ ఆరోపించారు. మేం మతాన్ని ప్రచార వస్తువుగా వాడుకోలేమని తెలిపారు. ప్రార్థనలు ఫలితాన్ని ఇస్తాయని తాము విశ్వసిస్తామని పేర్కొన్నారు. తాము ఎవరూ అడగకముందే దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. మతం, భక్తి విషయంలో తమకు ఎవరు బుద్ధులు చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. సీఎం సిద్ధరామయ్య పేరులో రామ, నా పేరులో శివ ఉన్నాయని వివరించారు. మన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలేమిటో తమకు తెలుసని చెప్పారు.


రాజకీయాల్లో ధర్మం ఉండాలి కానీ ధర్మంలో రాజకీయాలు ఉండొద్దని బీజేపీ నాయకులకు ఘాటుగా బదులిచ్చారు. సెలవు విషయమై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా ఒక ప్రకటన చేశారు. సోమవారం సెలవు అనేది లేదని ప్రకటించారు. రామప్రతిష్టాపన ఉత్సవ వేళ దేశంలో కొన్ని వర్గాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక వ్యాప్తంగా సోమవారం పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయాలని పోలీసులను ఆదేశించినట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు.

Also Read: Lok Sabha Elections: సర్వీసింగ్‌కు వెళ్లిన 'కారు' యమస్పీడ్‌తో దూసుకొస్తది: కేటీఆర్‌

Also Read: APCC Chief YS Sharmila: తొలి రోజే స్వరాష్ట్రం ఏపీలో వైఎస్‌ షర్మిలకు ఘోర అవమానం
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook