కోవిడ్ ( Covid ) తో బాధపడుతున్న ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ( Singer Sp Bala subrahmanyam ) ఆరోగ్యం కుదుటపడుతున్నట్టుగా తెలుస్తోంది. నెమ్మెదిగా పాడేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్టు ఆయన కుమారుడు అప్ డేట్ ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రి ( Chennai MGM Hospital ) లో గత కొద్దిరోజులుగా  ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కోవిడ్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మొన్నటివరకూ విషమంగా ఉన్న ఆయన ఆరోగ్యం రెండ్రోజుల్నించి మెరుగ్గా ఉందని ఆయన కుమారుడు ఎప్పటికప్పుడు అందస్తున్న అప్ డేట్ ద్వారా తెలుస్తోంది. చికిత్సకు బాలు శరీరం సహకరిస్తోందని..శ్వాస ప్రక్రియ మెరుగైందని వైద్యులు ఇప్పటికే వెల్లడించారు. ఇదే పరిస్థితి కొనసాగితే వారం రోజుల్లో ఎక్మో పరికరాన్ని తొలగించవచ్చు. 


తన తండ్రి పాడేందుకు ప్రయత్నిస్తున్నారని...పాటలు వింటున్నారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ (Sp charan update ) అప్ డేట్ అందించారు. తన తండ్రి కోలుకుంటున్నారనేందుకు ఇదే నిదర్శనమని ఎస్పీ చరణ్ తెలిపారు. నిన్నటికంటే పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. రెండ్రోజుల్నించి ఎస్పీ ఆరోగ్యం కుదుటపడుతోందన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Also read: Supreme court: మొహర్రమ్ ఊరేగింపునకు సుప్రీం.. నో