Supreme court: మొహర్రమ్ ఊరేగింపునకు సుప్రీం.. నో

మొహర్రం ఊరేగింపులు ( Moharram procession ) అత్యున్నత న్యాయస్థానం నో చెప్పింది. దేశవ్యాప్తంగా అనుమతించడం ద్వారా ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేసినట్టేనని కోర్టు అభిప్రాయపడింది. హైకోర్టుకు వెళ్లాల్సిందిగా పిటీషనర్ కు సూచించింది.

Last Updated : Aug 27, 2020, 06:56 PM IST
 Supreme court: మొహర్రమ్ ఊరేగింపునకు  సుప్రీం.. నో

మొహర్రం ఊరేగింపులు ( Moharram procession ) అత్యున్నత న్యాయస్థానం నో చెప్పింది. దేశవ్యాప్తంగా అనుమతించడం ద్వారా ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేసినట్టేనని కోర్టు అభిప్రాయపడింది. హైకోర్టుకు వెళ్లాల్సిందిగా పిటీషనర్ కు సూచించింది.

దేశవ్యాప్తంగా మొహర్రం ఊరేగింపులకు అనుమతివ్వాలని కోరుతూ షియా వర్గానికి చెందిన ఓ నేత సుప్రీంకోర్టు ( Supreme court ) ను ఆశ్రయించారు. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్( Chief justice ) ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్ లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశమంతటికీ సాధారణ ఉత్తర్వులను ఎలా జారీ చేస్తామని ప్రశ్నిస్తూ...అలహాబాద్ హైకోర్టు ( Allahabad high court ) లో అప్పీలు చేసుకోవల్సిందిగా పిటీషనర్ కు సూచించింది. అంతేకాకుండా ఊరేగింపులకు అనుమతివ్వడం సాధ్యం కాదని..ఇది గందరగోళానికి తావివ్వడమే కాకుండా కోవిడ్ 19 వ్యాప్తికి ( Covid 19 spread ) ఓ వర్గాన్ని టార్గెట్ చేసే అవకాశముందని కోర్టు స్పష్టం చేసింది. పెద్ద సంఖ్యలో ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఆదేశాలు జారీ చేయలేమని చెప్పింది. పూరీ జగన్నాధ్ రధయాత్ర ( puri jagannath procession ) ఓ నిర్ధిష్ట ప్రాంతానికి సంబంధించినదని..అందుకే దానికి తగ్గట్టుగా ఆదేశాలు జారీ చేశామని కోర్టు తెలిపింది. అదే విధంగా కేవలం లక్నోకే పరిమితమయ్యేలా పరిమిత సంఖ్య ప్రార్ధనలు చేసుకునేలా అనుమతిని అలహాబాద్ కోర్టులో కోరవచ్చని పిటీషనర్ కు సూచించింది. Also read: Krishan Pal Gurjar: మరో కేంద్ర మంత్రికి కరోనా

Trending News