Yo Yo Honey Singh: గృహ హింస కేసు విచారణ.. కన్నీటి పర్యంతమైన Shalini Talwar
Honey Singh domestic violence case, Shalini Talwar: యో యో హనీ సింగ్ చేతిలో తాను ఎదుర్కోన్న అవమానాలు, అరాచకాలు గురించి కోర్టులో న్యాయమూర్తి తానియా సింగ్‌కి వివరించే క్రమంలో అతడి భార్య శాలిని తల్వార్ దుఖం ఆపుకోలేకపోయారు.
Honey Singh domestic violence case, Shalini Talwar: ఫేమస్ పాప్ సింగర్ యో యో హనీ సింగ్ భార్య శాలిని తల్వార్ అతడిపై గృహ హింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే. శనివారం ఈ కేసు విచారణకు రావడంతో ఢిల్లీలోని తీస్ హజారి కోర్టుకు హాజరైన శాలిని తల్వార్.. కేసు విచారణ జరుగుతుండగానే కోర్టు రూమ్‌లో కన్నీటి పర్యంతమయ్యారు. యో యో హనీ సింగ్ చేతిలో తాను ఎదుర్కోన్న అవమానాలు, అరాచకాలు గురించి కోర్టులో న్యాయమూర్తి తానియా సింగ్‌కి వివరించే క్రమంలో శాలిని తల్వార్ దుఖం ఆపుకోలేకపోయారు. తనకు మరో మార్గం లేకపోవడంతోనే చివరకు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆమె జడ్జికి వివరించారని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది.
యోయో హనీ సింగ్ మారుతాడనే నమ్మకంతో తాను అతడికి పదేళ్లు అవకాశం ఇచ్చానని.. కానీ అతడు మాత్రం తనను ఒంటరిని చేసి వదిలేశాడని శాలినీ తల్వార్ కోర్టు హాలులో వాపోయారు.
యోయో హని సింగ్‌పై నమోదైన గృహ హింస కేసు విచారణ సందర్భంగా శాలిని తల్వార్ (Singer Yo Yo Honey Singh's wife Shalini Talwar) వాదనలు విన్న న్యాయమూర్తి తానియా సింగ్.. కోర్టు నుంచి ఎలాంటి పరిష్కారం ఆశిస్తున్నారని ఆమెను ప్రశ్నించారు. యోయో హనీ సింగ్ కేసు విచారణకు హాజరుకాకపోవడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. దీంతో యోయో హని సింగ్ తరపున వాదనలు వినిపించడానికి వచ్చిన న్యాయవాది స్పందిస్తూ.. హని సింగ్ ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లే కోర్టుకు హాజరుకాలేకపోయారని, తదుపరి విచారణకు కోర్టులో హాజరవుతారని హామీ ఇచ్చారు.
Also read : Yo Yo Honey Singh affairs: యోయో హనీ సింగ్ సీక్రెట్ ఎఫైర్స్, మ్యారేజ్, అతడి లైంగిక వాంఛలపై సంచలన విషయాలు వెల్లడించిన భార్య
యోయో హనిసింగ్ (Yo Yo Honey Singh) తరుపు న్యాయవాది చెప్పిన సమాచారంతో సంతృప్తి చెందని జడ్జి తానియా సింగ్.. అలాంటప్పుడు అతడు తన మెడికల్ సర్టిఫికెట్స్‌తో ఈకేసులో అవసరమైన ఇన్‌కమ్ అఫిడవిట్స్ కోర్టుకు ఎందుకు సమర్పించలేదని తీవ్రంగా మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook