Six dead, several injured as bus catches fire in Maheshpur | న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. బస్సు విద్యుత్ తీగను తాకి ఆరుగురు దుర్మరణం చెందగా.. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్‌ జాలోర్ జిల్లాలోని మహేష్‌పుర్ గ్రామంలో శనివారం అర్థరాత్రి ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో నిండిన బస్సు మహేష్‌పుర్‌ (Maheshpur)లో విద్యుత్ తీగను తాకడంతో.. బస్సు దగ్ధమై (Bus Fire) ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు అంబులెన్స్‌లో గాయపడ్డ వారిని జోద్‌పూర్‌ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే బస్సులో 25 మంది వరకూ ప్రయాణికులున్నారు. గాయపడ్డవారిలో మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని, మరో 13 మంది బాధితులకు సైతం చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే బస్సు దారితప్పి గ్రామంలోకి ప్రవేశించిందని స్థానికుడు ధనశ్యామ్ సింగ్ తెలిపాడు. ఈ క్రమంలో గ్రామంలోని 11 కేవీ లైన్‌కు బస్సు తాకడంతో మంటలు (Fire Accident) చెలరేగాయని పేర్కొన్నాడు. Also Read: Maharashtra: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. పది మంది శిశువుల మృతి


జైన మతానికి చెందిన యాత్రికులతో వెళ్తున్న బస్సు రూటు మారి మహేష్‌పుర్ గ్రామం వైపు చేరుకుంది. ఈ క్రమంలో గ్రామంలోని విద్యుత్‌ వైర్లు తక్కువ ఎత్తులో వేలాడుతుండటంతో కండక్టర్‌ బస్సుపైకి ఎక్కగా.. విద్యుత్‌ షాక్‌ తగిలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కండక్టర్‌ బస్‌పైనే సజీవ దహనం కాగా.. బస్సుకు విద్యుత్‌ సరఫరా జరిగి మంటలు వ్యాపించినట్లు పేర్కొంటున్నారు. (Rajasthan) పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read: COVID-19 Vaccination: వ్యాక్సినేష‌న్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook