ఆకాశంలో అద్భుతం గోచరించింది. ప్రపంచవ్యాప్తంగా అంతా ఎదురు చూస్తున్న సూర్య గ్రహణం ఆకాశంలో ఇవాళ కనువిందు చేసింది. ఈ ఏడాదికి చివరి సూర్యగ్రహణం కాబట్టి .. అందరిలో ఆసక్తి నెలకొంది. అంతా ఊహించినట్లుగానే సూర్య గ్రహణం అద్భుతంగా కనువిందు చేసింది. భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రజలు సూర్యగ్రహణాన్ని చూసేందుకు ఉత్సాహం చూపించారు. ప్రత్యేక కళ్లద్దాలు పెట్టుకుని సూర్యగ్రహ గమనాన్ని వీక్షించారు. పాక్షిక సూర్యగ్రహణం కాబట్టి సూర్యుని చుట్టూ కాంతివంతమైన రింగ్ ఏర్పడింది. దీంతో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. దీన్ని అంతా ఆసక్తిగా తిలకించారు. ఒడిశా, తమిళనాడు, కేరళ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీల్లో సూర్య గ్రహణాన్ని చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: 2019 చివరి సూర్యగ్రహణం


[[{"fid":"180719","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


సూర్యగ్రహణంపై మోదీ ఆసక్తి 
సూర్యగ్రహణంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆసక్తి కనబరిచారు. ఢిల్లీలో సూర్యగ్రహణాన్ని చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. ఐతే ఆకాశం మేఘావృతం కావడంతో సరిగ్గా సూర్యగ్రహణాన్ని చూడలేకపోయారు. మిగతా భారతీయుల్లాగే తనకు కూడా ఆసక్తి ఉన్నప్పటికీ .. మేఘాలు నిరాశపరిచాయని .. ఈసారి సూర్యగ్రహణాన్ని చూడలేకపోయానని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఐతే కేరళలోని కోజికోడ్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించానని తెలిపారు. తద్వారా సూర్యగ్రహణంపై నిపుణుల ద్వారా మరింత విజ్ఞానాన్ని సంపాదించుకున్నానని ట్వీట్ చేశారు.