న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి (Coronavirus) చెందకుండా ఉండేందుకు కేంద్రం విధించిన లాక్ డౌన్ (Lockdown) విధానంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం దేశంలో ప్రాణాంతకమైన కరోనా వ్యాపించకుండా లాక్ డౌన్ పాటించాల్సిన అవసరమైతే ఉన్నప్పటికీ.. ఒక సరైన ప్రణాళిక లేకుండానే లాక్ డౌన్ విధించడమే సరైంది కాదని సోనియా గాంధీ అన్నారు. ఒక ప్రణాళిక లేకుండానే కేంద్రం లాక్ డౌన్ విధించిన కారణంగానే దేశవ్యాప్తంగా వలస కార్మికులు (Migrant workers) తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కేంద్రం వైఖరిపై సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తంచేశారు. కరోనావైరస్ పరీక్షల్లో నిమగ్నమైన సిబ్బందికి, కరోనా పాజిటివ్ రోగులకు వైద్య సేవలు అందిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి సరైన కరోనా సోకకుండా సరైన సదుపాయాలు కల్పించడంలో కేంద్రం విఫలమైందని ఆమె మండిపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : ఏప్రిల్ 15 నుంచి టికెట్ల రిజర్వేషన్లపై రైల్వే శాఖ క్లారిటీ


ఈ సందర్భంగా కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సోనియా గాంధీ కరోనా నివారణకు కృషిచేస్తోన్న సిబ్బందికి హజ్మత్ సూట్స్ (Hazmat suits), ఎన్-95 మాస్కులు (N-95 maksks) వంటి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ అందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గురువారం కాంగ్రెస్ అత్యున్నత స్థాయి కమిటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ (CWC meeting) అనంతరం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..