'కరోనా వైరస్' కారణంగా ..దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 3 వేల 700 రైళ్లు రద్దు చేశారు. ఏకంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయడం ఇదే తొలిసారి. దీంతో రైల్వే కోచ్ లు మొత్తం ఎక్కడిక్కడే నిలిచిపోయాయి.
దేశవ్యాప్తంగా 3 వేల 700 రైళ్లు 21 రోజులపాటు సేవలు నిలిపివేయడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ క్రమంలో లాక్ డౌన్ పొడగించే అవకాశం ఉందంటూ ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. మరోవైపు రైల్వే టికెట్ల రిజర్వేషన్ కు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏప్రిల్ 15 నుంచి రైల్వే టికెట్ రిజర్వేషన్లు తిరిగి ప్రారంభించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది.
Certain media reports have claimed that Railways has started reservation for post-lockdown period.
It is to clarify that reservation for journeys post 14th April was never stopped and is not related to any new announcement. pic.twitter.com/oJ7ZqxIx3q
— Ministry of Railways (@RailMinIndia) April 2, 2020
తాము లాక్ డౌన్ సమయం వరకే టికెట్ రిజర్వేషన్లు ఆపేశామని వెల్లడించింది. అంటే మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వరకు ఇది అమలులో ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిజానికి రైల్వే టికెట్లు 120 రోజుల ముందుగా బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఐతే లాక్ డౌన్ సమయం తర్వాతి ప్రయాణాల కోసం తాము ఎప్పుడూ టికెట్ రిజర్వేషన్లు ఆపలేదని స్పష్టం చేసింది. ఇది కొత్త ప్రకటన ఏం కాదని తెలిపింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..