Summer Special Trains: వేసవి సెలవులు కావడంతో ప్రయాణాలు ఎక్కువయ్యాయి. రవాణా మార్గాలన్నీ ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేకించి రైళ్లన్నీ రద్దీగా ఉంటుండటంతో రైల్వే శాఖ ప్రత్యామ్నాయంగా ప్రత్యేక రైళ్లు ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ మధ్య రద్దీని దృష్టిలో ఉంచుకుని 44 ప్రత్యేక రైళ్లు ప్రారంభించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైలు నెంబర్ 08585 విశాఖపట్నం-మహబూబ్‌నగర్ మధ్య మే 2 నుంచి జూన్ 27 వరకూ ప్రత్యేక రైలు ప్రతి మంగళవారం సాయంత్రం 5.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు చేరుతుంది. 


రైలు నెంబర్ 08586 మహబూబ్‌నగర్ నుంచి విశాఖపట్నానికి మే 3 నుంచి జూన్ 28 వరకూ ప్రత్యేక రైలు ప్రతి బుధవారం సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు చేరుతుంది.


రైలు నెంబర్ 08583 విశాఖపట్నం-తిరుపతి ప్రత్యేక రైలు మే 1 నుంచి జూన్ 26 వరకూ నడుస్తుంది. ప్రతి సోమవారం సాయంత్రం 7.10 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.15 గంటలకు చేరుతుంది. 


రైలు నెంబర్ 08584 తిరుపతి-విశాఖపట్నం ప్రత్యేక రైలు మే 2 నుంచి జూన్ 28 వరకూ ఉంటుంది. ప్రతి మంగళవారం రాత్రి 9.55 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10.15 గంటలకు చేరుతుంది. 


రైలు నెంబర్ 08543 విశాఖపట్నం-బెంగళూరు కంటోన్మెంట్ ప్రత్యేక రైలు మే 7 నుంచి జూన్ 28 వరకూ నడుస్తుంది. ఈ రైలు ప్రతి ఆదివారం మద్యాహ్నం 3.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మద్యాహ్నం 12.30 గంటలకు చేరుతుంది. 


రైలు నెంబర్ 08544 బెంగళూరు-విశాఖపట్నం ప్రత్యేక రైలు మే 8 నుంచి జూన్ 9 వరకూ నడుస్తుంది. ప్రతి సోమవారం మద్యాహ్నం 3.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మద్యాహ్నం 1.30 గంటలకు చేరుతుంది. 


రైలు నెంబర్లు 08585, 08586 విశాఖపట్నం-మహబూబ్‌నగర్-విశాఖపట్నం మద్య దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, మిర్యాలగూడ, నల్గొండ, మల్కాజ్ గిరి, కాచిగూడ, ఉమ్దానగర్, షాద్ నగర్, జడ్చర్ల మధ్య ప్రత్యేక రైలు నడుస్తుంది. 


ఇక రైలు నెంబర్ 08583, 08584 విశాఖపట్నం-తిరుపతి-విశాఖపట్నం రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.


రైలు నెంబర్లు 08543, 08544 విశాఖపట్నం-బెంగళూరు-విశాఖపట్నం రైళ్లు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కుప్పం, బంగారంపేట్, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతాయి.


Also read: Karnataka Assembly Elections 2023 : కర్ణాటకలోకి రోడ్డు మీదకు స్టార్ హీరోలు.. కాంగ్రెస్ కోసం శివరాజ్ కుమార్, బీజేపీ కోసం కిచ్చా సుదీప్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook