Cargo Express Trains: సౌత్ సెంట్రల్ రైల్వే ( South Central Railways ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలిసారి కార్గో ఎక్స్ ప్రెస్ ( Cargo Express Trains ) ట్రైన్లను నడపాలని నిర్ణయించుకుంది. ఈ కార్గో రైళ్లు ఆగస్టు 5వ తేది నుంచి సుమారు ఆరు నెలల పాటు నడపనుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలను విశ్లేషించిన తదుపరి నిర్ణయం తీసుకుంటాం అని తెలిపింది సౌత్ సెంట్రల్ రైల్వే. కార్గో ఎక్స్ ప్రెస్‌ల వల్ల చిన్న, మధ్య తరహా వినియోగదారులకు లబ్ధి చేకూరుతుంది అని తెలిపింది. గతంలో సరుకు రవాణా చేయాలి అంటే కేవలం బల్క్‌గా మాత్రమే పంపే అవకాశం ఉండేది. కొత్త కార్గో ట్రైన్స్ వల్ల ఆ ఇబ్బంది తొలగనుంది అని తెలుస్తోంది. (  ఆయుర్వాద మసాజ్ సెంటర్..లోపలికి వెళ్తే వ్యభిచార సామ్రాజ్యం ) 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ నేపథ్యంలో రైల్వే ఆదాయానికి గండిపడింది. దీంతో ఆదాయం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఎక్స్ ప్రెస్ ట్రైన్లను నడపాలని నిర్ణయించుకన్నట్టు తెలుస్తోంది. ఎక్స్ ప్రెస్ చార్జీలను హైదరాబాద్ నుంచి డిల్లీకి టన్నుకు రూ.2500గా ఫిక్స్ చేసినట్టు సమాచారం.  మరింత సమాచారం కోసం  9701371976, 040-27821393 నెంబర్లకు కాంటాక్ట్ చేయవచ్చు.



హాట్ భ్యూటీ Sherlyn Chopra ఘాటు ఫోటోలు


Follow us on twitter