దక్షిణ భారతదేశంలో ఒక రాష్ట్ర గవర్నర్ "లైంగిక దుష్ప్రవర్తన" ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై కేంద్ర హోంశాఖకు కూడా సోమవారం ఫిర్యాదు అందింది. రాజ్ భవన్ లో మహిళా ఉద్యోగులను గవర్నర్ తనకు సన్నిహితంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఆ ఫిర్యాదులో ఆరోపణలు ఉన్నాయి. లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలకు సంబంధించిన నివేదిక ఢిల్లీలో హోం మంత్రిత్వ శాఖకు చేరుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే దీనిపై కేంద్ర హోంశాఖ పెదవివిప్పలేదు. అయితే ఈ ఆరోపణలు ప్రస్తుతం గవర్నర్ గా ఉన్నప్పటి కాలానిదా?లేదా అంతకు ముందుకు సంబంధించినదా? వాస్తవం ఏంటో తేల్చాలని దర్యాప్తు సంస్థలకు నివేదించినట్టు ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ఆధారంగా ప్రముఖ జాతీయ పత్రిక ఓ కథనం ప్రచురించింది. దోషిగా తేలితే, గవర్నర్ ను రాజీనామా చేయాలంటూ కోరే అవకాశాలున్నాయని సమాచారం.


గవర్నర్ల మీద ఈ తరహా ఆరోపణలు కొత్తేమీ కాదు. 2017లో మేఘాలయ గవర్నర్ వి.షణ్ముగనాథన్ పై ఈ తరహాలోనే ఫిర్యాదులు వచ్చినప్పుడు రాజీనామా చేయవలసి వచ్చింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 100 మందికి పైగా రాజ్ భవన్ ఉద్యోగులను అడిగి రాజీనామా కోరారు.