Rain Alert: దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తరాధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న దేశ రాజధాని ఢిల్లీని నైరుతి రాగం తాకింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. గతనెల 1న కేరళను తాకిన రుతుపవనాలు..వేగంగా కదుతూ..దేశమంతటా విస్తరించాయి. రుతు పవనాల ప్రభావంతో రాగల మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో వానలు కురుస్తున్నాయి. కింది స్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయి. వీటికి తోడు నైరుతి రుతుపవనాలు మరింత బలపడుతున్నాయి. దీంతో రాగల మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.


ఏపీలోనూ ఇదే వాతావరణం కనిపిస్తోంది. మూడురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంత ప్రజలు అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించింది. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈమేరకు వెదర్‌ రిపోర్ట్‌ను అధికారులు ప్రకటించారు. 



Also read: TSRTC: ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..బస్‌ టికెట్‌తోపాటే దర్శన టోకెన్..!


Also read:Tirumala: తిరుమలలో యథావిధిగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు..టీటీడీ కీలక నిర్ణయం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook