Tirumala: తిరుమలలో యథావిధిగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు..టీటీడీ కీలక నిర్ణయం..!

Tirumala: సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించారు. ఈసందర్భంగా కీలక సూచనలు చేశారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 1, 2022, 03:03 PM IST
  • అధికారులతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమీక్ష
  • బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై చర్చ
  • ఈసారి ఘనంగా బ్రహ్మోత్సవాలు
Tirumala: తిరుమలలో యథావిధిగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు..టీటీడీ కీలక నిర్ణయం..!

Tirumala: ఈఏడాది యథావిధిగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరువీధుల్లో స్వామి వారు విహరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రెండేళ్లు కోవిడ్ కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఈసారి ఘనంగా చేసేందుకు ఏర్పాట్లన్నీ చేస్తామని ఆయన వెల్లడించారు. సెప్టెంబర్ 27న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

అక్టోబర్ 1న గరుడ సేవ, 2న బంగారు రథం జరగనుంది. అక్టోబర్ 4న మహారథం, 5న చక్రస్నానం ఉండనుంది. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ ఉండనుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. ఈమేరకు సీఎం జగన్‌కు ఆహ్వాన పత్రిక అందజేస్తామన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నామని వెల్లడించారు. వీఐపీ సిఫార్సు లేఖల దర్శనాలు సైతం రద్దు చేస్తున్నామన్నారు ఈవో ధర్మారెడ్డి.

Also read: TSRTC: ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..బస్‌ టికెట్‌తోపాటే దర్శన టోకెన్..!

Also read: Amaravathi: అమరావతి ఉద్యోగులకు శుభవార్త..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News