Margaret Alva: జగదీప్ ధన్‌ఖడ్‌ను ఢీకొట్టనున్న మార్గరెట్ అల్వా..ఇంతకు ఎవరీ మహిళ..?
Margaret Alva: దేశవ్యాప్తంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇరుపక్షాలు గట్టిగా పోటీ పడుతున్నాయి. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వా పోటీ చేయనున్నారు. ఆమె బయోడేటా ఇప్పుడు చూద్దాం..
Margaret Alva: విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వా పేరును ఖరారు చేశారు. ఈవిషయాన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. ఎల్లుండి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఈక్రమంలోనే వచ్చే నెల 6న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఈమేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
1942 ఏప్రిల్ 14న కర్ణాటకలోని మంగళూరులో మార్గరెట్ అల్వా జన్మించారు. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ అభ్యసించారు. కళాశాలలో చదువుతున్న సమయంలోనే ఆమె చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే వారు. విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1964 మే 24న నిరంజన్ థామస్, మార్గెట్ అల్వాలకు వివాహమైంది.
అల్వాకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1969లో ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈక్రమంలోనే కాంగ్రెస్‌లో చేరి కీలక పదవులు చేపట్టారు. 1974లో తొలిసారి రాజ్యసభకు ఎంపికయ్యారు. 1980,1986,1992లో వరుసగా రాజ్యసభకు నియమితులయ్యారు. 1999లో ఉత్తర కన్నడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 2004 ఎన్నికల్లో పోటీ చేసి మార్గరెట్ అల్వా ఓడిపోయారు.
2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. ఆ తర్వాత నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. గోవాకు 17వ గవర్నర్‌గా సేవలందించారు. గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా పనిచేశారు.
Also read:CM Kcr: వరద బాధితులకు అండగా ఉంటాం..ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే..!
Also read:Margaret Alva: విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా..ఇక రసవత్తర పోరు తప్పదా..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.