Babri Masjid Demolition Verdict: బాబ్రీ కూల్చివేత ప్లాన్ కాదు.. అందరూ నిర్దోషులే
28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసు (Babri Masjid demolition case) లో సంచలన తీర్పు వెలువడింది. బాబ్రీ మసీదు కూల్చివేతను ప్లాన్ ప్రకారం చేసింది కాదని, నిందితులుగా ఉన్నవారంతా నిర్దోషులేనంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది.
CBI Special court verdict in the Babri case: లక్నో: 28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసు (Babri Masjid demolition case) లో సంచలన తీర్పు వెలువడింది. బాబ్రీ మసీదు కూల్చివేతను ప్లాన్ ప్రకారం చేసింది కాదని, నిందితులుగా ఉన్నవారంతా నిర్దోషులేనంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది. దాదాపు రెండేళ్లనుంచి రోజువారీ విచారణను చేపట్టిన సీబీఐ ప్రత్యేక ధర్మాసనం బుధవారం తీర్పును వెలువరించింది. బాబ్రీ మసీదు కూల్చివేతను పథకం ప్రకారం చేసింది కాదని.. ఈ కేసులో నిందితులుగా ఉన్న 32మంది నిర్దోషులేనంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ మేరకు 2000 పేజీలు ఉన్న తీర్పు కాపీనీ న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ చదివి వినిపించారు. సీబీఐ సమర్పించిన ఆడియో, వీడియా ఆధారాల మూలంగా నిందితులనుదోషులగా తేల్చలేమని, నిందితులపై ఇచ్చిన ఆధారాలు బలంగా లేవని కోర్టు అభిప్రాయపడింది. Also read: Babri Masjid demolition case: నేడే బాబ్రీ తీర్పు
1992, డిసెంబరు 6వ తేదీన అయోధ్యలోని బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన కేసులో నిందితులుగా ఉన్నవారంతా లక్నో ప్రత్యేకకోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే 32 మంది నిందితుల్లో 26 మంది మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. హాజరుకాని వారిలో బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, జోషీ, ఉమాభారతి, కల్యాణ్ సింగ్ ఉన్నారు. అయితే అంతకుముందు బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ 351 మంది సాక్షులను, 600 డాక్యుమెంటరీ పత్రాలను కోర్టు ముందు కోర్టు ముందు ఉంచింది. అయితే బాబ్రీ కూల్చివేతలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు.. నేరపూరిత కుట్రకు పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు లేవని... సీబీఐ తగిన సాక్ష్యాధారాలను చూపలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది. Also read: Babri Masjid demolition case: 30న బాబ్రీ కేసు తీర్పు
1992 డిసెంబరు 6న యూపీలోని అయోధ్యలో కరసేవకులు బాబ్రీ మసీదు కూల్చివేసిన కేసులో 32మంది నిందితులుగా ఉన్నారు. వారిలో బీజేపీ అగ్రనేతలు లాల్ కృష్ణ అద్వానీ (Lal Krishna Advani), మురళీ మనోహర్ జోషి, అశోక్ సింఘాల్, ఉమాభారతి, కల్యాణ్ సింగ్, వినయ్ కటియార్, వీహెచ్‌పీ నాయకులు తదితరులు నిందితులుగా ఉన్నారు. అయితే ఈ కేసును రెండేండ్లలో విచారణ పూర్తిచేసి తీర్పు వెలువరించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని 2017లో సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటినుంచి ప్రత్యేక కోర్టు రోజూవారి విచారణను చేపట్టింది. 2019 జులైలో ఆ గడువు ముగియడంతో మరో 9 నెలలపాటు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే ఆ గడువును 2020 మేలో మరోసారి ఆగస్టు 31వరకు పొడిగించింది. అయితే ఈ కేసులో తీర్పు వెలువరించేందుకు మరింత సమయం కావాలని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సుప్రీంను అభ్యర్థించగా.. సెప్టెంబరు 30 నాటికి తీర్పును వెలువరించాలంటూ జస్టిస్ రొహింటన్ నారీమన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రత్యేక కోర్టు సెప్టెంబరు 30 బుధవారం సంచలన తీర్పును వెలువరించింది.