ఎవరూ రైల్వే స్టేషన్కు రావొద్దు..!!
`కరోనా వైరస్` శరవేగంగా విస్తరిస్తున్న వేళ.. లాక్ డౌన్ పొడగించారు. ఈ క్రమంలో దేశంలోని వలస కార్మికులు.. ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఐతే వారిని స్వస్థలాలకు తరలించేందుకు కేంద్రం శ్రామిక్ రైలు పేరుతో ప్రత్యేక రైలు బండి నడిపిస్తోంది.
వలస కూలీలు రైల్వే శాఖ వినతి
ఎవరూ రైల్వే స్టేషన్ కు రావొద్దు..
రాష్ట్రాలు కోరితేనే రైలు బండి..!!
ప్రత్యేక రైళ్లు నడపడం లేదని స్పష్టీకరణ..!!
'కరోనా వైరస్' శరవేగంగా విస్తరిస్తున్న వేళ.. లాక్ డౌన్ పొడగించారు. ఈ క్రమంలో దేశంలోని వలస కార్మికులు.. ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఐతే వారిని స్వస్థలాలకు తరలించేందుకు కేంద్రం శ్రామిక్ రైలు పేరుతో ప్రత్యేక రైలు బండి నడిపిస్తోంది.
కానీ ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం అవసరం ఉంటుంది. ఐతే సమన్వయ లోపం కారణంగా వలస కార్మికులకు ఇది ఇబ్బందికర పరిస్థితిగా మారింది. వేలాదిగా వలస జీవులు.. రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వకుండానే దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్నారు. తమను రైలు బండిలో తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడక్కడా ఆందోళనకు కూడా దిగుతున్న పరిస్థితి నెలకొంది.
పెద్ద ఎత్తున స్టేషన్లకు తరలి వస్తున్న వలస కూలీలతో రైల్వే స్టేషన్ల వద్ద ఆందోళనకర పరిస్థితి ఉంది. అలాగే ప్రత్యేక రైళ్లు వచ్చేస్తున్నాయ్.. అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలో రైల్వే శాఖ దీనిపై స్పష్టమైన ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, పర్యాటకులు, విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నామని తెలిపింది. ఐతే అది రాష్ట్ర ప్రభుత్వాలు కోరిన మీదట మాత్రమే నడిపిస్తున్నామని క్లారిటీ ఇచ్చింది.
అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన ప్రయాణీకులను మాత్రమే శ్రామిక్ రైళ్లల్లో ప్రయాణించేందుకు అనుమతిస్తున్నామని తెలిపింది. మిగతా ప్రయాణీకులు ఎవరినీ అనుమతించడం లేదని చెప్పింది. అలాంటి ప్రయాణీకులు ఎవరూ రైల్వే స్టేషన్ల వద్దకు రావొద్దని విజ్ఞప్తి చేసింది.
సాధారణ ప్రయాణీకుల కోసం రైల్వే శాఖ ఎలాంటి ప్రత్యేక రైళ్లు నడిపించడం లేదని స్పష్టం చేసింది. అంతే కాదు ప్రస్తుతం ప్రయాణీకుల రైళ్లన్నీ రద్దయ్యాయని తెలిపింది. మే 17 వరకు లాక్ డౌన్ అమలులో ఉన్న దృష్ట్యా.. ఇప్పటి వరకు రైలు ప్రయాణాల పునః ప్రారంభంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించింది. అలాగే రైల్వే కౌంటర్లలో టికెట్లు అమ్ముతున్నారనే వార్తలు నిజం కాదని తెలిపింది. ఏ స్టేషన్ లోనూ ఎలాంటి టికెట్ల అమ్మకం జరగడం లేదని స్పష్టం చేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..