ఎమ్మెల్యేలు, ఎంపీలపై పెండింగ్ కేసుల విచారణకు స్పెషల్ కోర్టు ఏర్పాటు
ఎమ్మెల్యేలు, ఎంపీలపై పెండింగ్ కేసులను విచారించేందుకు ఏర్పాటైన స్పెషల్ ట్రయల్ కోర్టు
ఎమ్మెల్యేలు, ఎంపీలు వంటి ప్రజాప్రతినిధులపై న్యాయస్థానాల్లో దశాబ్ధాల తరబడి ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉండటం, అయినప్పటికీ సదరు ప్రజాప్రతినిధులు మళ్లీమళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తుండటం సర్వసాధారణంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఎమ్మెల్యేలు, ఎంపీలపై అలా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేకంగా విచారణ చేపట్టేందుకు ఇవాళ చెన్నైలో ఓ ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటైంది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన సమాచారం ప్రకారం జిల్లా జడ్జి శాంతిని ఈ స్పెషల్ ట్రయల్ కోర్టుకు న్యాయమూర్తిగా నియమిస్తూ సంబంధిత యంత్రాంగం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని తెలుస్తోంది.
[[{"fid":"174222","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Special trial court to hear pending cases against MLAs and MPs","field_file_image_title_text[und][0][value]":"ఎమ్మెల్యేలు, ఎంపీలపై పెండింగ్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు "},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Special trial court to hear pending cases against MLAs and MPs","field_file_image_title_text[und][0][value]":"ఎమ్మెల్యేలు, ఎంపీలపై పెండింగ్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు "}},"link_text":false,"attributes":{"alt":"Special trial court to hear pending cases against MLAs and MPs","title":"ఎమ్మెల్యేలు, ఎంపీలపై పెండింగ్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు ","class":"media-element file-default","data-delta":"1"}}]]