Sputnik V vaccine price: Apollo హాస్పిటల్స్ ఇవ్వనున్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా ?
Sputnik V vaccine price fixed by Apollo Hospitals: న్యూ ఢిల్లీ: రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ భారత్‌లో పంపిణీ కోసం అనుమతి పొందిన సంగతి తెలిసిందే. జూన్ 2వ వారం నుంచి స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్న అపోలో హాస్పిటల్స్ తాజాగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సింగిల్ డోస్ ధరను ఖరారు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
Sputnik V vaccine price fixed by Apollo Hospitals: న్యూ ఢిల్లీ: రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ భారత్‌లో పంపిణీ కోసం అనుమతి పొందిన సంగతి తెలిసిందే. జూన్ 2వ వారం నుంచి స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్న అపోలో హాస్పిటల్స్ తాజాగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సింగిల్ డోస్ ధరను ఖరారు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేస్తుండగా.. దేశంలో కరోనా కేసులు భారీగా పెరగడం, వీలైనంత త్వరగా అందరికీ వ్యాక్సినేషన్ అవసరం ఉండటం, కొవాగ్జిన్, కొవీషీల్డ్ ఉత్పత్తి సామర్థ్యం సరిపోకపోవడంతో రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వికి అత్యవసర వినియోగం కింద కేంద్రం ఏప్రిల్ 12నే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఒక డోసు స్పుత్నిక్ వీ టీకాను రూ.1195కు (Sputnik V vaccine single dose price) ఇవ్వనున్నట్లు అపోలో హాస్పిటల్స్ తెలిపింది. వ్యాక్సిన్ ధర రూ.995 కాగా వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ చార్జీ కింద మరో రూ.200 కలిపి మొత్తం రూ. 1195 వసూలు చేయనున్నట్టు అపోలో హాస్పిటల్స్ స్పష్టంచేసింది. అపోలో గ్రూప్‌కి చెందిన అన్ని ఆస్పత్రులలో స్పుత్నిక్ వి అందుబాటులోకి రానుంది.
Also read : COVID-19 vaccine కి ముందు లేదా తర్వాత alcohol తీసుకోవచ్చా ? Side effects ఏంటి ?
రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తయారీదారులతో కలిసి ప్యాన్‌ఏసియా బయోటెక్ (Panacea Biotec) అనే ఫార్మాసుటికల్ కంపెనీ భారత్‌లో కరోనా వ్యాక్సిన్లను తయారుచేస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డిలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు తయారు అవుతున్నాయి. ఇవే కాకుండా మరో 3 మిలియన్ల స్పుత్నిక్ వి వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంటున్నట్టు రష్యాకు భారత రాయబారి అయిన డి బాల వెంకటేష్ వర్మ తెలిపారు.
జూన్ 2వ వారం నుంచి ప్రతీ వారం 10 లక్షల మందికి స్పుత్నిక్ వి టీకాలు ఇస్తామని అపోలో హాస్పిటల్స్ గ్రూపు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శోభనా కామినేని (Shobana Kamineni) తెలిపారు. ప్రస్తుతానికి ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా రెండు కోట్ల మందికి వ్యాక్సిన్లు (COVID-19 vaccines) ఇవ్వడమే అపోలో హాస్పిటల్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు శోభన కామినేని పేర్కొన్నారు.
Also read : Vaccine first dose తీసుకున్న తర్వాత కరోనా సోకితే ఏం చేయాలి ? Second dose ఎప్పుడు తీసుకోవాలి ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook