అయోధ్యలో త్వరలో విమానాశ్రయం నిర్మితం కానుంది. ప్రస్తుతం జరుగుతున్న భూ సేకరణ పూర్తి కాగానే నిర్మాణం ప్రారంభం కానుంంది. విమానాశ్రయానికి రాముడి పేరు పెడుతూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామజన్మభూమి వివాదాని ( Ram janmabhoomi Dispute )కి తెరపడిన తరువాత అయోధ్యలో ఇటీవలే శ్రీరామమందిర నిర్మాణానికి భూమిపూజ కూడా జరిగింది. అయోధ్యలో రామమందిరాని ( Rammandir )కి భూమి పూజ జరిగినప్పటి నుంచి భక్తుల తాకిడి పెరిగింది. ఆలయం పూర్తయితే భక్తుల తాకిడి మరింతగా పెరగనుంది. అందుకే అయోధ్య ( Ayodhya )లో విమానాశ్రయం నిర్మించనుంది కేంద్ర పౌరవిమాన యాన శాఖ.  ఈ మేరకు అనుమతులు సైతం మంజూరయ్యాయి. ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ ( Ayodhya Airport )కోసం భూ సేకరణ జరుగుతోంది. ఇది పూర్తయిన తరువాత కేంద్ర విమానయాన శాఖ..అయోధ్యలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు చేపట్టనుంది.


మరోవైపు అయోద్యలో నిర్మించ తలపెట్టిన ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి యూపీ ప్రభుత్వం ( Up Government ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్‌కు శ్రీరాముడి పేరు పెడుతూ ఉత్తరప్రదేశ్ యోగీ కేబినెట్ ( Yogi cabinet ) తీర్మానం చేసింది. ఈ నిర్ణయంపై హిందూ సంస్థలు, సాధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  రామమందిరానికి భూమిపూజ జరిగిన తరువాత తొలి దీపావళిని ( Diwali ) ఇటీవల అయోధ్యలో భారీ స్థాయిలో జరుపుకున్నారు. Also read: Ahmed Patel: అహ్మద్ పటేల్ మృతి: ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల సంతాపం