Kumbha mela: కుంభమేళాలో తొక్కిసలాట.. 17 మంది భక్తుల మృత్యువాత..

Stampede at Kumbhamela: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఘోరం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం తొక్కిసలాట జరగడంతో 17 మంది భక్తులు మరణించినట్లు సమాచారం. త్రివేణి సంగమం ఘాట్ వద్ద మౌని అమావాస్య సందర్భంగా భారీగా భక్తులు రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
Stampede at Kumbhamela: ప్రయాగ్‌రాజ్‌లో ఈరోజు ఉదయం ఘోరం చోటు చేసుకుంది. కుంభమేళాలో తొక్కిసలాట జరగడంతో 17 మంది భక్తులు మరణించారు. చాలామంది భక్తులు గాయపడ్డారు. పరమ పవిత్రమైన మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం ఘాటు వద్దకు భారీ ఎత్తున భక్తులు చేరుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. భక్తుల తాకిడికి బారికేడ్లు విరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగిందని జాతీయ మీడియా పేర్కొంటుంది. బాధితులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆరా తీశారు.
మౌనీ అమావాస్య అమృత స్నానానికి పదికోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు. ఇక ఘటన స్థలానికి అంబులెన్సులు వచ్చాయి. గాయపడిన వారిని కుంభమేళా సెక్టార్ 2 కు తరలించారు. తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఈరోజు అమృత స్నానం కేన్సల్ చేసినట్లు అఖారా పరిషద్ (కౌన్సెల్) ప్రకటించింది. అయితే, స్నానం చేసిన వెంటనే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్లాలని భక్తులకు అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడ్డారు.
రెండు బస్సులో 60 మందిమి వచ్చాం, మా గ్రూపులో 9 మంది ఉన్నారు. సడెన్‌గా వెనుక నుంచి ఎవరో తోసినట్లయింది. దీంతో మేము ఆ రద్దీలో చిక్కుకుపోయాం. అందరూ కింద పడిపోయారు. ఇక జనాలను నియంత్రించలేని పరిస్థితి ఏర్పడిందని కర్నాటక నుంచి వచ్చిన ఓ భక్తురాలు తెలిపింది.
మౌనీ అమావాస్య అత్యంత పవిత్రమైనది. ఈరోజు గంగా స్నానం చేస్తారు. ఉత్తరప్రదేశ్ ఈ భారీ రద్దీని నియంత్రించడానికి సరైన జాగ్రత్తలు కూడా తీసుకుంది. ఇక్కడ సెక్టార్ వారీగా ఆంక్షలు కూడా విధించారు. ఈ వేడుకలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, ఈ ఘోరం జరిగింది. ఇక వీడియోల్లో కూడా వేల మంది భక్తులు గంగా స్నానం చేయడానికి ఒక్క దగ్గర గుమిగూడిన దృశ్యాలను చూడవచ్చు. మహాకుంభమేళాలో వచ్చే ఈ మౌనీ అమావాస్య హిందూవులకు పరమపవిత్రమైంది. ఈ రోజు మౌన వ్రతం కూడా ఆచరిస్తారు. కొంతమంది ఉపవాసం చేస్తారు. త్రివేణి సంగమం వద్ద పితరులకు తర్పణాలు కూడా పెడతారు.
ఇదీ చదవండి: నుమాయిష్‌లో అనసూయ భరద్వాజ్.. మేడమ్ మిమ్మల్ని ఎవరూ గుర్తుపట్టలేదా?
బాగ్‌పత్..
నిన్న ఉత్తర ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో కూడా లడ్డూ మహోత్సవంలో ఘోర ప్రమాదం జరిగింది. జైన కమ్యూనిటీకి చెందిన ఈ ఉత్సవంలో వెదురు కర్రలతో తయారు చేసిన స్టేజీపైకి ఒక్కసారిగా వందల మంది రావడంతో వేదిక కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. పదుల సంఖ్యలో తీవ్రగాయాలు అయ్యాయి. ఆదినాథ నిర్వాణ కార్యక్రమంలో జైన భక్తులు లడ్డూలు సమర్పించడానికి ఒక్కసారిగా వచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలోనే తిరుమల తొక్కిసలాట ఘటనలో కూడా 8 మంది చనిపోయారు. ఇది తీవ్రంగా కలచివేసింది.
ఇదీ చదవండి: స్ట్రాబెర్రీ ఈ రహస్యం తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు, రోజూ తింటారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.