SBI PO Notification: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బీఐ నిరుద్యోగులకు వరుసగా గుడ్‌న్యూస్ అందిస్తోంది. ఇటీవలే క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన ఎస్బీఐ తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి ప్రొబిషనరీ ఆఫీసర్ నియామకాలు చేపట్టనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగులకు ఇదే మంచి అవకాశం. దేశంలోని దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ భారీగా రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఒకటి 13,735 క్లర్క్ పోస్టుల భర్తీకు సంబంధించింది. ఈ నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇక రెండవది తాజాగా ప్రొబిషనరీ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ ఎస్బీఐ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 600 పీవో పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అర్హత ఉన్న అభ్యర్ధులు ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ https:///bank.sbi/web/careers/current-openings ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఎస్బీఐ పీవో పోస్టులకు అర్హతేంటి, ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది, వయస్సు ఎంత ఉండాలనే వివరాలు మీ కోసం..


మొత్తం ఖాళీలు 600 ప్రొబిషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు
విద్యార్ఙత  ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ
ఎంపిక ప్రక్రియ- వివిధ దశల్లో ఉంటుంది. ముందుగా ప్రిలిమ్స్ పరీక్ష తరువాత మెయిన్స్ పరీక్షలుంటాయి. ఆ తరువాత సైకోమెట్రిక్ పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. రెండేళ్లు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. 
వయస్సు- 2024 ఏప్రిల్ 1 నాటికి 21-30 ఏళ్లు
దరఖాస్తు రుసుము- జనరల్ లేదా ఓబీసీ అభ్యర్ధులకు 750 రూపాయలు ఫీజు, ఇతర కేటగరీలకు ఉచితం
జీతం-ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 48,480 రూపాయల నుంచి 85,920 రూపాయలుంటుంది


Also read: UAN Activation: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, యూఏఎన్ యాక్టివేషన్ గడువు పెంపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.