UAN Activation: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, యూఏఎన్ యాక్టివేషన్ గడువు పెంపు

UAN Activation: కోట్లాది ఈపీఎఫ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్. యూఏఎన్ యాక్టివేషన్, ఆధార్ లింక్ గడువును ఈపీఎఫ్ఓ మరోసారి పొడిగించింది. బ్యాంక్ ఎక్కౌంట్‌తో ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడంతో ఈపీఎఫ్ సభ్యులకు ఇది ప్రయోజనకరం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 27, 2024, 05:49 PM IST
UAN Activation: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, యూఏఎన్ యాక్టివేషన్ గడువు పెంపు

UAN Activation: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సభ్యులకు శుభవార్త అందించింది. సభ్యులకు సంబంధించి రెండు అంశాలపై అప్‌డేట్ జారీ చేసింది. మొదటిది యూఏఎన్ యాక్టివేషన్ కాగా, రెండవది ఆధార్ కార్డుతో బ్యాంక్ ఎక్కౌంట్ అనుసంధాన ప్రక్రియ. ఈ రెండూ జరిగితేనే ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ ప్రయోజనం అందుతుంది. 

Add Zee News as a Preferred Source

ఈపీఎఫ్ఓ సభ్యులకు ముఖ్య గమనిక. ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పధకం ప్రయోజనాలు క్లైమ్ చేసేందుకు బ్యాంక్ ఎక్కౌంట్‌తో ఆధార్ కార్డు అనుసంధానం, యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ తప్పనిసరి. ఈఎల్ఐ పధకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో ప్రారంభించింది. అయితే బ్యాంక్ ఎక్కౌంట్‌తో ఆధార్ అనుసంధానం, యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ ప్రక్రియ పూర్తి కాకపోతే ఈ పధకం లబ్ది అందకపోవచ్చు. అందుకే తప్పనిసరిగా ఈ రెండింటి ప్రక్రియ పూర్తి కావల్సి ఉంది. ఉద్యోగులంతా తప్పనిసరిగా యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ చేయించుకోవాలి. ప్రతి ఈపీఎఫ్ఓ సభ్యుడు యూనివర్శల్ ఎక్కౌంట్ నెంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసుండాలి. ఆధార్ కార్డు బ్యాంక్ ఎక్కౌంట్‌లో లింక్ అయుండాలి. అప్పుడే మెంబర్ పోర్టల్‌లో లాగిన్ అవుతుంది. 

యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ కావడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. పీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్, పీఎఫ్ ఆన్‌లైన్ విత్‌డ్రాయల్, అడ్వాన్స్ బదిలీ, వ్యక్తిగత సమాచారం అప్‌డేట్ చేయడం, క్లెయిమ్ స్టేటస్ చెక్ చేయడం వంటి సేవలు లభిస్తాయి. యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ కూడా చాలా సులభం. ఆధార్ ఆధారిత ఓటీపీతో అవుతుంది. ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్‌లో మూడు రకాలుంటాయి. ఇందులో ఎ అనేది మొదటిసారి ఈపీఎఫ్ పథకంలో చేరిన ఉద్యోగికి వర్తిస్తుంది. బి అనేది తయారీ రంగంలో ఉద్యోగ కల్పనకు సంబంధించింది. ఇక సి అంటే ఉద్యోగులకు సహకారమిచ్చేది. 

తయారీ రంగంలో అదనపు ఉద్యోగాల కల్పనకు స్కీమ్ బి అనేది ప్రోత్సహిస్తుంది. అటు ఉద్యోగి ఇటు యజమాని ఇరువురికీ నిర్ణీత పరిమాణంలో లాభం కలుగుతుంది. ప్రభుత్వం యాజమాన్యాలకు నెలకు 3 వేలు రీయింబర్స్ చేస్తుంది. వాస్తవానికి యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ చివరి తేదీ నవంబర్ 30 ఉండేది. కానీ పీఎఫ్ సభ్యుల ప్రయోజనార్ధం జనవరి 15 వరకూ గడువు పొడిగించారు. అధిక పెన్షన్‌కు సంబంధించి 3 లక్షల 10 వేల పెండింగ్ దరఖాస్తులకు లాభం కలగనుంది. 

Also read: Big Gift for Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బహుమతి, ఇకపై వేతన సంఘం స్థానంలో కొత్త విధానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Trending News