న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ డియోరియా జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ముస్లిం అమ్మకందారుల నుండి కూరగాయలను కొనవద్దని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. అయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అయింది. బీజేపీ ఎమ్మెల్యే సురేష్ తివారీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి అంటూ బహిరంగంగా ముస్లింలు నుండి కూరగాయలు కొనకండి అనే వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది కూడా చదవండి : సమంత మజిలీ (Happy birthday Samantha Akkineni) 


తబ్లిఘి జమాత్ కారణంగానే ఈ కరోనా మహమ్మారి వైరస్ వ్యాప్తి వేగంగా చెందుతోందని అన్నారు. ముస్లిం అమ్మకందారుల వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారని లాలాజలంతో సోకుతుందేమోనని భయపడుతున్నారని అన్నారు. కాగా ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా వారి నుండి కూరగాయలు కొనడం మానేయమని అన్నానని ఈ విషయంలో నేనేమి తప్పు చేశానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 


ఇది కూడా చదవండి : ఆస్పత్రిలో 77 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్


తివారీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే ద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లు మండిపడ్డారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..