Jai Hind in Haryana Government: గుడ్‌ మార్నింగ్‌.. ఇలా మనం ఉదయం లేచినప్పటి నుంచి మనకు తెలిసినవారికి, బంధువులకు లేదా స్నేహితులను కూడా పలకరింపుగా వాడుతున్న పదం. అంతేకాదు సాధారణంగా అన్ని స్కూళ్లలో టీచర్‌ క్లాస్‌లోకి రాగానే పిల్లలందరూ ఒకేసారి పైకి లేచి గుడ్‌ మార్నింగ్‌ అని ఉపాధ్యాయులపై తమకు ఉన్న గౌరవాన్ని ఇలా విష్‌ చేస్తూ పలకరిస్తారు. అయితే, ఇక ఆ గుడ్‌ మార్నింగ్ కి గండి పడనుంది. ఎక్కడైనా ఉదయం అయితే, గుడ్‌ మార్నింగ్‌ మధ్యాహ్నం అయితే, గుడ్‌ ఆఫ్టార్‌నూన్‌, సాయంత్రం అయితే, గుడ్‌ ఈవెనింగ్‌ చెబుతారు. నో.. ఇక పై అలా చెప్పకూడదు.. మరి ఏం చెప్పాలి?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హరియాణ ప్రభుత్వం స్కూళ్లకు ఓ కొత్త నిబంధన తీసుకువచ్చింది. మనం చిన్నప్పటి నుంచి కూడా ఉపాధ్యాయులను విష్‌ చేసే విధానంలోనే మార్పులు తీసుకువచ్చింది. సాధారణంగా ఎప్పుడైనా స్కూళ్లలో టీచర్‌ క్లాసు రూమ్‌లోకి రాగానే పిల్లలంతా ఒకేసారి గుడ్‌ మార్నింగ్‌ అని విష్‌ చేస్తారు. అది ఉదయం అయితే, మరి మధ్యాహ్నం లేదా సాయంత్రం అయితే, గుడ్‌ ఆఫ్టార్‌నూన్‌, గుడ్‌ ఈవెనింగ్‌ అని చెబుతారు. కానీ, హరియాణ ప్రభుత్వం చేసిన మార్పు ఏంటంటే ఇక పై అలా చెప్పకుండా కేవలం 'జైహింద్‌' మాత్రమే చెప్పి టీచర్లను విష్‌ చేయాలట.


ఇదీ చదవండి:  ఉద్యోగులకు షాక్.. కొత్తపెన్షన్‌ విధానం నుంచి పాత పెన్షన్‌కు మారడానికి ఇక నో ఛాన్స్..


ఈ విధానాన్ని అన్ని స్కూళ్లలో రానున్న ఆగష్టు 15వ తేదీ నుంచి అమలు చేయనుందట. ఎందుకంటే ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆరోజు నుంచే ప్రారంభించనున్నారట. దీనిపై బీజేపీ సర్కార్‌ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నాయబ్‌ సింగ్‌ సైనీ నేతృత్వంలో ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది. అంటే ఏళ్లుగా స్కూళ్లలో పిల్లలు టీచర్లను పలకరించే విధానంలో మార్పులు రానున్నాయి. ఎందుకంటే పిల్లల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, ఐక్యతను నాటుకోవాలని ఈ కీలక మార్పులకు నాంది పలికింది హరియాణ ప్రభుత్వం.


అయితే, ఆగష్టు 15 నుంచి హరియాణ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకు రావడంతో ఇక పై స్కూలు విద్యార్థులు టీచర్లతో పాటు తమ స్నేహితులతో కూడా ఇలా జైహింద్‌ అని పలకరించు కోవడం మొదలవుతుంది. హరియాణ ప్రభుత్వం తన రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ఈ తాజా ఉత్తర్వులను జారీ చేసింది. స్వాతంత్ర్యం రాకముందు జైహింద్‌ అనే నినాదం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ భారతీయులను అంతా ఏకతాటిపై తీసుకురావడానికి ఈ నినాదం చేశారు. అందుకే అప్పట్లో అందరూ నాయకులు ఒకరినొకరు జైహింద్‌ అని చెప్పుకునేవారు.


ఇదీ చదవండి:  నాగార్జున సాగర్‌ టూర్‌ ప్యాకేజీ కేవలం రూ.800.. ఇంకా ఎన్నో చూడవచ్చు..!


అయితే, స్కూళ్లలో మాత్రం ఎన్నో ఏళ్లుగా గుడ్‌ మార్నింగ్‌ తోనే టీచర్లను పలకరించేవారు. పిల్లల్లో దేశభక్తి పెంచడానికి ఇలా చేస్తున్న కొత్త విధానం పాఠశాలల్లో ఎంత వరకు అమలు అవుతుందో చూడాలి. మొత్తానికి ఈ జైహింద్‌ నినాదం పిల్లల్లో తమ స్కూలు విద్యను అభ్యసిస్తున్న సమయం నుంచే పెంచాలనుకుంటున్న విధానం పాఠశాలల్లో కూడా ఎంత వరకు అమలు అవుతుందో చూడాలి.
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter